ఏంటీ! ఇలాంటి స్టేటస్‌లు పెడుతున్నావని ప్రశ్నించిన స్నేహితులు.. ఏం లేదంటూ దాటవేసిన యువతి.. పెళ్లయిన మూడు నెలలకే..
ABN, First Publish Date - 2022-08-28T00:08:03+05:30
ఆమెకు మూడు నెలల క్రితమే వివాహమైంది. కూతురు భర్తతో కలిసి హాయిగా ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవల ఆమె వాట్సప్‌లో వరుసగా విచారకరమైన స్టేటస్‌లు..
ఆమెకు మూడు నెలల క్రితమే వివాహమైంది. కూతురు భర్తతో కలిసి హాయిగా ఉంటుందని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇటీవల ఆమె వాట్సప్‌లో వరుసగా విచారకరమైన స్టేటస్‌లు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని భర్త, ఆమె కుటుంబ సభ్యులు గమనించలేదు. ఇటీవల ఆమె స్నేహితులకు అనుమానం వచ్చింది. ఏంటీ! ఇలాంటి స్టేటస్‌లు (Whatsapp status) పెడుతున్నావ్.. అంటూ స్నేహితులు ప్రశ్నించారు. ఏం లేదంటూ దాటవేసిన యువతి.. ఇటీవల సడన్‌గా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రం ఇండోర్ పరిధి ఖజ్రానా ప్రాంతంలోని ఆశానగర్‌కు చెందిన మెహందీ కళాకారిణి అయిన దీప్‌శిఖా శర్మకు గ్వాలియర్‌లోని మురార్ ప్రాంతానికి చెందిన శుభం శర్మతో ఇటీవల పరిచయం ఏర్పడింది. శుభం శర్మ చెందిన కేఫ్‌కు.. యువతి తరచూ వస్తూ పోస్తూ ఉండేది. కొన్నాళ్లకు వీరి పరిచయం ప్రేమగా మారింది. మూడు నెలల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇదిలావుండగా, దీప్‌శిఖా తండ్రి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పుల కారణంగా ఆమె సోదరుడు కూడా ఇటీవలే ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి రుణదాతలు.. దీప్‌శిఖాతో పాటూ ఆమె తల్లినీ వేధిస్తున్నారు. ఈ విషయంపై ఆమె ఇటీవల మానసిక ఒత్తిడితో ఉండేది. ఈ క్రమంలో మూడు రోజులుగా తన వాట్సప్ స్టేటస్‌లో విచారకరమైన సందేశాలు (Sad messages) పెడుతూ ఉండేది. దీన్ని భర్త గానీ, కుటుంబ సభ్యులు గానీ గమనించలేదు.
కాళ్ల పారాణి ఆరకముందే.. ఆస్పత్రిలో చేరిన యువతి.. ఇంటి బయట నీళ్లు పడుతుండగా ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహిస్తారా..
అయితే స్నేహితులు చూసి.. ఎందుకు! రోజూ ఇలాంటి స్టేటస్‌లు పెడుతున్నావ్.. అంటూ ప్రశ్నించారు. ఏమీ లేదంటూ ఊరికే పెడుతున్నా.. అంటూ మాట దాటవేసింది. గురువారం పుట్టింటి నుంచి భర్త వద్దకు వచ్చిన దీప్‌శిఖా.. మూడీగా కనిపించింది. రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన భర్త పోలీసులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు భర్తను విచారించారు. ఇదిలావుండగా, కట్నం కోసం అల్లుడు వేధించడంతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందిని.. మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఈ ఘటనతో స్థానికంగా విషాదచాయలు అలుముకున్నాయి.
ప్రేమికుడికి పెళ్లవడంతో అతడి సోదరుడిని ప్రేమించిన యువతి.. అతనూ ఊరు విడిచి వెళ్లడంతో.. మూడో వ్యక్తితో వివాహం.. చివరకు ఓ రోజు..
Updated Date - 2022-08-28T00:08:03+05:30 IST