ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Aftab Poonawalla: తీహార్ జైలులో ఆఫ్తాబ్‌కు ఇంగ్లీష్ నవల

ABN, First Publish Date - 2022-12-05T05:55:12+05:30

శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా తీహార్ జైలు అధికారులు ఇంగ్లీష్ నవల అందించారు....

Aftab Poonawalla
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలా తీహార్ జైలు అధికారులు ఇంగ్లీష్ నవల అందించారు. తీహార్ జైలులోని 4వనంబర్ గదిలో(Tihar Jail Cell) ఉన్న ఆఫ్తాబ్ తాను చదువుకోవడానికి ఇంగ్లీషు నవలలు కావాలని అభ్యర్థించాడని జైలు అధికారులు చెప్పారు. దీంతో ఆఫ్తాబ్(Aftab Poonawalla) అభ్యర్థన మేర అతనికి ‘ది గ్రేట్ రైల్వే బజార్’ అనే ఆంగ్ల పుస్తకాన్ని (English Book The Great Railway Bazaar) జైలు అధికారులు ఇచ్చారు. జైలు గదిలో ఉన్న ఆఫ్తాబ్ తోటి ఖైదీలతో చెస్ ఆడుతున్నాడని జైలు అధికారులు చెప్పారు.

జైలులో భద్రత పెంపు

ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) వెలుపల శ్రద్ధా హంతకుడు ఆఫ్తాబ్ ను తీసుకెళుతున్న జైలు వ్యాన్‌పై దాడి జరిగిన తర్వాత, తీహార్ జైలు అధికారులు అఫ్తాబ్ పూనావాలా జైలు క్వార్టర్స్ వెలుపల భద్రతను పెంచారు. ఆఫ్తాబ్ ఉంటున్న జైలు బ్యారక్ వెలుపల అదనపు గార్డును నియమించారు.అఫ్తాబ్‌కు జైలు లోపల ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని అతని సెల్ చుట్టూ ప్రత్యేక నిఘా ఉంచామని జైలు అధికారులు పేర్కొన్నారు.

పశ్చాత్తాపం కనిపించలేదు...

‘‘ఆఫ్తాబ్ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు, అతను ఎవరినీ కలవడు అతను చేసిన హత్యకు పశ్చాత్తాపం కూడా లేనట్లుగా సమయానికి తిని నిద్రపోతున్నాడు’’అని జైలు అధికారులు చెప్పారు.

Updated Date - 2022-12-05T06:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising