పూడ్చిపెట్టిన 19 రోజుల తర్వాత సమాధిని తవ్వి మృతదేహానికి DNA Test.. కనీవినీ ఎరుగని వింత కేసు.. అసలు కథేంటంటే..
ABN, First Publish Date - 2022-07-05T23:30:28+05:30
ఒక్కోసారి కొన్ని కేసులు... పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఏళ్లు గడుస్తున్నా.. కేసులు మాత్రం పరిష్కారం కావు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చిది..
ఒక్కోసారి కొన్ని కేసులు... పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారుతుంటాయి. ఏళ్లు గడుస్తున్నా.. కేసులు మాత్రం పరిష్కారం కావు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చిది. చనిపోయిన వ్యక్తి తమ వాడంటే.. తమ వాడంటూ రెండు కుటుంబాలు ముందుకొచ్చాయి. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. చివరకు పూడ్చిపెట్టిన 19రోజుల తర్వాత సమాధిని తవ్వి, మృతదేహానికి DNA Test చేశారు. కనీవినీ ఎరుగని ఈ వింత కేసు.. వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొత్వాలిలోని ఢిల్లీ-హౌరా రైల్వే మార్గంలో పట్టాలపై జూన్ 11న ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. యువకుడు రైలు కింద పడి మృతి చెందినట్లు పోలీసు విచారణలో తేలింది. అయితే మృతదేహం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 14వ తేదీన కౌశాంబి ప్రాంతానికి చెందిన షబ్బీర్.. మృతదేహం తమ కుమారుడు రంజాన్(22)దే అని పోలీసులకు తెలిపాడు. మూడు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అప్పటి నుంచి తమ కుమారుడి కోసం వెతుకుతున్నామని తెలిపారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని.. షబ్బీర్ కుటుంబానికి అప్పగించారు. అనంతరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పూడ్చి, సమాధి కట్టించారు. ఇదిలావుండగా, జూన్ 28న ఫతేపూర్ జిల్లాకు చెందిన సంత్రాజ్ సైనీ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు.
wapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..
జూన్11న తమ కుమారుడు సూరజ్(20) మిస్సింగ్ అయ్యాడని చెప్పారు. మొబైల్ చివరి లొకేషన్.. బాన్‌పోకర ప్రాంత పరిధిలో చూపించడంతో అక్కడికి వెళ్లామన్నారు. జూన్ 11న రైల్వే ట్రాక్‌పై యువకుడి మృతదేహం లభ్యమైందని.. స్థానికులు తమకు తెలిపారని గుర్తు చేశారు. చనిపోయిన వ్యక్తి తమ కుమారుడే అంటూ భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. దీంతో 19 రోజుల తర్వాత.. జూలై 3న మృతదేహాన్ని బయటకు తీసి, డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. అలాగే షబ్బీర్, సంత్రాజ్ కుటుంబాల నుంచి.. వెంట్రుకలు, గోళ్లు, చర్మం, రక్త నమూనాలను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. DNA రిపోర్టు ఆధారంగా మృతదేహం ఎవరిదనే విషయం తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి ఈ ఘటన.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
పెళ్లి చేసుకోకపోగా.. అబార్షన్ చేయించాలని చూశాడు.. బిడ్డను చంపుకోవడం ఇష్టం లేదని ఆమె అనడంతో..
Updated Date - 2022-07-05T23:30:28+05:30 IST