Allu Arjun: కేరళ స్టూడెంట్‌కు సాయం... కలెక్టర్ పోస్ట్ వైరల్!
ABN, First Publish Date - 2022-11-11T18:38:24+05:30
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో బయటకు తెలిసినవి కొన్నే! కేరళలోని ఓ విద్యార్థినికి సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు ఈ వార్త బయటకొచ్చింది.
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu arjun) ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో బయటకు తెలిసినవి కొన్నే! కేరళలోని ఓ విద్యార్థినికి (bunny helps kerala student)సాయం చేసి తన మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు ఈ వార్త బయటకొచ్చింది. అలెప్పీకి చెందిన ఓ విద్యార్థినికి అల్తు అర్జున్ ఆర్థిక సాయం చేశారు. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయి ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఓ మెరిట్ స్టూడెంట్ (Merit student) పైచదువుకు అయ్యే ఖర్చంతా బన్నీ భరిస్తున్నారు. ఈ వివరాలు ఇప్పటి వరకూ బయటకు రాలేదు. అలెప్పీ కలెక్టర్ కృష్ణతేజ చేసిన ఓ పోస్ట్‌తో ఇప్పుడు బయటకు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మనం చేేస పనిలో మంచి కనిపించాలి తప్ప మనిషి కనిపించాల్సిన అవసరం లేదు’ అని బన్నీ (icon star allu arjun)చెప్పిన డైలాగ్‌ను అభిమానులు షేర్ చేస్తున్నారు. కృష్ణతేజ పోస్ట్‌లో ఏముందంటే ‘‘కొన్ని రోజుల క్రితం నన్ను ఓ విద్యార్థిని కలిసింది. కొవిడ్‌తో ఆమె తండ్రి మరణించారు. ఇంటర్‌లో 92 శాతం ఉత్తీర్ణత సాధించిన ఆ అమ్మాయికి పైచదువులకు వెళ్లలేని పరిస్థితి. ఆ స్టూడెంట్‌కు ఫ్యూచర్‌పై ఉన్న ఆశ, నమ్మకం ఆమె మాటల్లో, కళ్లల్లో స్పష్టంగా కనిపించాయి. నర్సింగ్ చేయాలనేది ఆమె కల. ‘వి ఆర్ ఫర్ అలెప్పీ’ ప్రాజెక్టులో భాగంగా ఆమెకు సాయం చేయాలనుకున్నాం. మెరిట్ కోటాలో దరఖాస్తు చేసుకునే సమయం ముగియడంతో. మేనేజ్‌మెంట్ కోటాలో ప్రయత్నించగా కట్టనమ్‌లోని సెయింట్ థామస్ నర్సింగ్ కాలేజీలో సీటు దక్కింది. దానికి ఓ స్పాన్సర్ కావాల్సి వచ్చింది. మన ఫేవరెట్ స్టార్ అల్లు అర్జున్‌కు ఈ విషయాన్ని చెప్పా. ఆయన స్పందించారు. విద్యార్థిని హాస్టల్ ఫీజుతో సహా ఖర్చులన్నీ ఆయనే భరిస్తానన్నారు. ఆ విద్యార్థిని కాలేజ్‌లో చేరిన మరుసటి రోజు నేను ఆ కాలేజీకి వెళ్లా. ఆమె బాగా చదివి, ప్రయోజకురాలై సమాజానికి ేసవ చేస్తుందనే నమ్మకం నాకుంది’’ అని కృష్ణతేజ పేర్కొన్నారు.
Updated Date - 2022-11-11T18:38:25+05:30 IST