ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

8 నెలల పాపకు ఎందుకిలా అయిందో తెలిస్తే.. ఫోన్‌ను పిల్లల దరిదాపులకు కూడా రానివ్వరు.. తల్లి బాత్రూంకు వెళ్లిన టైమ్‌లో..

ABN, First Publish Date - 2022-09-13T23:45:03+05:30

మొబైల్ ఫోన్ల కారణంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫోన్ల విషయంలో జాగ్రత్తలు (Precautions) పాటించకపోతే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొబైల్ ఫోన్ల కారణంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఫోన్ల విషయంలో జాగ్రత్తలు (Precautions) పాటించకపోతే కొన్నిసార్లు ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా ఫోన్లు చార్జింగ్ పెట్టే విషయంలో ఫోన్లు పేలిపోయే ఘటనలు (Phone exploding) తరచూ జరుగడం చూస్తూనే ఉన్నాం. కొందరు చిన్నపిల్లల చేతికి ఫోన్లు ఇస్తుంటారు. ఇది ప్రమాదమని తెలిసినా చాలామంది అలాగే చేస్తుంటారు. ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. చార్జింగ్ పెట్టిన ఫోన్ పేలిపోయిన ఘటనలో అభం శుభం తెలీని ఓ చిన్నారి అశువులుబాసింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలీ పరిధి ఫరీద్‌పూర్‌లోని పచ్చుమి గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సునీల్ కుమార్ కశ్యప్ అనే వ్యక్తికి భార్య కుసుమ్, రెండేళ్లు, 8నెలల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతను తన ఇంటిపై సోనాల్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిలావుండగా, శనివారం సునిల్ భార్య ఇంట్లో మొబైల్‌ను చార్జింగ్ పెట్టింది. పక్కనే తమ ఇద్దరు పిల్లలు పడుకుని ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఆమె బాత్రూంకు వెళ్లింది. అయితే ఉన్నట్టుండి సడన్‌గా సెల్ పేలిపోయింది. అగ్గి రవ్వలు మంచంపై పడడంతో మంటలు అంటుకున్నాయి.

రైల్లో బెర్త్‌పై పడుకుని ఉన్న 17 ఏళ్ల అమ్మాయి.. సడన్‌గా పోలీసుల ఎంట్రీ.. మధ్యలోనే దింపేసి స్టేషన్‌కు.. అసలు కథేంటంటే..


శబ్ధం విని కుసుమ్.. పరుగెత్తుకుంటూ వచ్చింది. ఎనిమిది నెలల చిన్నారికి అంటుకున్న మంటలను ఆర్పేసింది. భర్తకు సమాచారం అందించడంతో పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి చిన్నారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు చిన్నారి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. ‘‘ఎంత పని జరిగిందమ్మా.. మా నిర్లక్ష్యం కారణంగా నిన్ను పొట్టనపెట్టుకున్నామే’’... అంటూ తల్లి బోరున విలపించింది. వైద్యులు సరైన సమయానికి స్పందించకపోవడంతోనే తమ పాప మృతి చెందిందని సునీల్ ఆరోపిస్తున్నాడు. కాగా, చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

కన్న కూతురని కూడా చూడకుండా నీచమైన పని.. గుడికి వెళ్లిన భార్య తిరిగొచ్చేసరికి..



Updated Date - 2022-09-13T23:45:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising