అద్దె ఇంట్లో ఉంటూ ఆసుపత్రిలో పని చేస్తున్న యువతి.. కొద్ది రోజుల్లో పెళ్లనగా అనూహ్య ఘటన.. తలలు పట్టుకున్న కుటుంబ సభ్యులు
ABN, First Publish Date - 2022-01-02T01:04:40+05:30
ఆమెకు 31ఏళ్లు. కష్టపడి వైద్య విద్య చదివింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం పొందింది. అద్దె ఇంట్లో ఉంటూ.. రోజూ డ్యూటీకి వెళ్లేది. కొద్ది రోజుల్లో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఆ యువతి వద్ద కూ
ఇంటర్నెట్ డెస్క్: ఆమెకు 31ఏళ్లు. కష్టపడి వైద్య విద్య చదివింది. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం పొందింది. అద్దె ఇంట్లో ఉంటూ.. రోజూ డ్యూటీకి వెళ్లేది. కొద్ది రోజుల్లో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. అదే విషయాన్ని ఆ యువతి వద్ద కూడా ప్రస్తావించారు. వాళ్ల నిర్ణయానికి ఆమె కూడా ఓకే చెప్పింది. ఇంతలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన నందిని.. ఎంతో కష్టపడి వైద్య విద్యను పూర్తి చేసింది. అనంతరం మత్తు డాక్టర్‌గా మొరాదాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌లో ఉద్యోగం పొందింది. కుటుంబ సభ్యులకు దూరంగా ఇంపీరియల్ గ్రీన్స్ సొసైటీలోని ఓ ఇంట్లో అద్దెకుంటూ విధులకు హాజరవుతోంది. కూతురికి మంచి ఉద్యోగం రావడంతో.. కుటుంబ సభ్యులు ఆమెకు పెళ్లి చేయాలని భావించారు. నందిని కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కాగా.. రోజూ ఫోన్లో మాట్లాడే కూతురు.. రెండు రోజులగా ఫోన్ చేయకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో వాళ్లే తమ కూతురికి ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. వారిలో కంగారు మొదలైంది. వెంటనే హాస్పటల్ వాళ్లను సంప్రదించి.. విషయం చెప్పారు. తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడాల్సిందిగా ప్రాధేయపడ్డారు.
ఈ క్రమంలో వారికి ఓ షాకింగ్ విషయం తెలిసిందే. తమ కూతురు చనిపోయిందని తెలిసి.. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తర్వాత అక్కడకు చేరుకున్న నందిని తల్లిదండ్రులు.. విగత జీవిగా పడిఉన్న నందిని చూసి గుండెలవిసేలా విలపించారు. కాగా.. నందిని సూసైడ్ చేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. ఆ దిశగా విచారణ ప్రారంభించారు. అయితే పోలీసుల తీరుపట్ల నందిని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఇబ్బందులు లేని అమ్మాయి.. ఎందుకోసం సూసైడ్ చేసుకుంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరో నందిని హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అదే కోణంలో విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని విన్నవించారు.
Updated Date - 2022-01-02T01:04:40+05:30 IST