Pushpa 2: 'పుష్ప 2' లో ఇంకో విలన్ ఇతనే ...

ABN, First Publish Date - 2022-12-05T15:02:34+05:30

ఈ సినిమాలో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు ఇంకో కొత్త విలన్ కూడా ఉన్నాడని ఒక వార్త

Pushpa 2: 'పుష్ప 2' లో ఇంకో విలన్ ఇతనే ...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' మొదటి పార్టు కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రష్యాలో కూడా రష్యన్ భాషలో ఈ సినిమా విడుదల అవుతోంది. అంతటి క్రేజ్ వచ్చిన ఈ సినిమా రెండో పార్టు ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే ఇంకా షూటింగ్ కూడా మొదలెట్టని ఈ సినిమాలో ఫవాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తో పాటు ఇంకో కొత్త విలన్ కూడా ఉన్నాడని ఒక వార్త నడుస్తోంది. (Another villain is going to add in Allu Arjun and Sukumar combination Pushpa 2 (Pushpa: The Rule) అయితే ఈ విలన్ ఎవరు అనేది ఇంకా అధికారికంగా ఎవరూ చెప్పటం లేదు. పుష్ప రెండో పార్టులో యాక్షన్ సన్నివేశాలు హాలీవుడ్ స్థాయిలో వుండేటట్టు ప్లాన్ చేస్తున్నారని కూడా తెలుస్తోంది. (Shooting of Pushpa 2 is going to start soon)

jaggu1.jpg

అదీ కాకుండా, తాజాగా అందిన సమాచారం ప్రకారం, జగపతి బాబు విలన్ గా రెండో పార్టు లోకి వస్తున్నట్టుగా తెలిసింది. జగపతి బాబు ఒక రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా తెలిసిడిని. జగపతి బాబు (Jagapathi Babu is going to enter as villain in Pushpa 2) ఎంటర్ అవటం తో పుష్ప ఈసారి పోరాటం చెయ్యాల్సింది చాలామంది విలన్స్ తో. అందులో ఎవరు ఎలా వుంటారో, చివరికి పుష్ప వేపు వస్తారో, లేక పుష్ప చేతిలో చేస్తారో సినిమా చూస్తే గానీ తెలీదు. కానీ జగపతి బాబు మాత్రం 'పుష్ప' రెండో పార్టు లో విలన్ గా ఎంటర్ అవుతున్నట్టు గా సమాచారం.

Updated Date - 2022-12-05T15:02:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising