Telugu, Tamil film controversy: చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్స్ వద్దన్న అల్లు అరవింద్, అశ్వినిదత్
ABN, First Publish Date - 2022-11-25T13:36:06+05:30
తెలుగు, తమిళ భాష సినిమాల వివాదాస్పదం రోజు రోజుకూ రాజుకుంటోంది. తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమాధానం చెప్పారు.
తెలుగు, తమిళ భాష సినిమాల వివాదాస్పదం రోజు రోజుకూ రాజుకుంటోంది. తమిళ నిర్మాతల మండలి సమావేశం అయి, విజయ్ నటించిన సినిమా 'వారసుడు' డబ్బింగ్ తెలుగు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలితో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే తెలుగు అగ్ర నిర్మాతలు ఇద్దరు, అల్లు అరవింద్, అశ్వని దత్ లు తెలుగు నిర్మాతల మండలి ఇచ్చిన ప్రకటన, తెలుగు చిత్రాలకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్నది వెనక్కి తీసుకోవాలని కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమాధానం చెప్పారు. (Top producers Ashwini Dutt, Allu Aravind supports Dil Raju's film 'Varasudu' to release in Telugu states means, they indirectly saying that not to give theaters to Chiranjeevi and Balakrishna films)
దీనిలో వివాదం ఏమి లేదు, సంక్రాంతి మనకి పెద్ద పండగ, అందుకని తెలుగు సినిమాలకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం, అని ప్రసన్న అన్నారు. అయితే ఈ అగ్ర నిర్మాతలు ఇద్దరు మాట్లాడే విధానాన్ని తప్పు పట్టారు ప్రసన్న కుమార్. "వాళ్లిద్దరూ ఏమి చెపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి థియేటర్స్ ఇవ్వవద్దు అని చెపుతున్నట్టేగా. వాళ్ళు విజయ్ సినిమా 'వారసుడు' కి థియేటర్స్ ఇవ్వాలని అని అంటున్నారు అంటే మన తెలుగు అగ్ర నటులకి ఇవ్వొద్దని చెపుతున్నట్టేగా," అని చెప్పారు ప్రసన్న కుమార్.
"ఇదే అశ్విన్ దత్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి' అప్పుడు తమిళనాడు లో విడుదల చేస్తే, ప్లాప్ అయింది కదా. తమిళ ప్రేక్షకులు ఆ సినిమాని ఒక పెద్ద జోక్ కింద తీసేసి చూడలేదు. అలాగే అతను ఒకే ప్రొడ్యూసర్ కి చెందిన రెండు సినిమాలు ఎలా ఒకేరోజు విడుదల చేస్తాడు అని అడిగారు. ఎందుకు విడుదల చెయ్య కూడదు, తెలుగు సినిమాలు పండగకి విడుదల చెయ్యడం మంచిదే కదా," అని చెప్పారు ప్రసన్న. (Some of the producers make rules and they only break the rules. They are all using the Telugu Film Industry for their personal business. Because of them only the TFI is sinking and other language people are talklng in an insulting manner about the TFI)
అల్లు అరవింద్ గురించి చెపుతూ, "అతను సినిమా కి ఎల్లలు లేవు, ఏ సినిమా ఎక్కడయినా విడుదల అవొచ్చు అని ఈరోజు మాట్లాడుతున్నాడు. కానీ మరి దిల్ రాజు 2019 లో డబ్బింగ్ సినిమాలు ఎలా పండగ కి విడుదల చేస్తారు అని ప్రశ్న వేసినప్పుడు, అల్లు అరవింద్ అప్పుడు దిల్ రాజ్ కి సపోర్ట్ చేసాడు. అప్పుడు ఒకలా, ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నాడు. వాళ్లే రూల్స్ పెడతారు, వాళ్లే రూల్స్ బ్రేక్ చేస్తారు. మన తెలుగు చిత్ర పరిశ్రమలో చాలామందికి పౌరుషం లేదు, తెలుగు పరిశ్రమని కాపాడుకోవాలన్న చింత లేదు. వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు," అని చాలా ఘాటుగా విమర్శించారు ప్రసన్న.
ఇదే విజయ్ తమిళ్ సినిమా 'వారిసు' కి ఎన్ని థియేటర్స్ తమిళ నాడులో ఇస్తున్నారు, దాన్ని బట్టి తెలుగులో ఎన్ని ఇస్తున్నారో తెలుస్తుంది. బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు హై బడ్జెట్ సినిమాలని, విజయ్ సినిమా తెలుగులో డబ్బింగ్ సినిమాగా వస్తే సుమారు 10 కోట్ల బడ్జెట్ సినిమా అవుతుందని చెప్పారు ప్రసన్న. మరి అలాంటప్పుడు ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఉండాలో ఇక్కడే తెలిసిపోతోంది కదా అన్నారు. అదీ కాకుండా తమిళ నాడు లో మల్టీప్లెక్స్ లో డబ్బింగ్ సినిమాలు వెయ్యరు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వేస్తాం కదా, అని చెప్పారు ప్రసన్న.
"నేను అడుగుతున్నాను. మన 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహ రెడ్డి' సినిమాలకి తమిళ్ నాడు లో ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారో చెప్పండి. అప్పుడు విజయ్ 'వారిసు' సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి అన్నది ఇక్కడ తెలుస్తుంది. ఈ ఇద్దరు అగ్ర నిర్మాతలు మరి తమిళ్ నాడులో మన తెలుగు సినిమాలకి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారో అడగ గలరా," చెప్పమనండి అని ప్రశ్నించారు ప్రసన్న. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కొంతమంది వ్యక్తుల వాళ్ళ పరిశ్రమకి చేటు వస్తోందని చెప్పారు ప్రసన్న. ఈరోజు 20 మంది తమిళ నటులను తెలుగు ప్రేక్షకులు పోషిస్తున్నారు. అదీ కాకుండా మలయాళం నటుల్ని కూడా మన మీద రుద్దుతున్నారు. తెలుగులో నటులే లేరా? అని ప్రశ్నించారు ప్రసన్న.
నెల్లూరు జిల్లాలో కనిగిరి, పోరుమామిళ్ల, సింగరాయకొండ లాంటి ప్రదేశాల్లో విజయ్ సినిమాకి థియేటర్ ఇచ్చారు, మరి తెలుగు సినిమాలకి ఇవ్వరా? విజయ్ అంటే అక్కడ తెలుగు ప్రేక్షకులకి అస్సలు తెలియదు కదా, మరి ఎలా వేస్తారు? ఒక సిస్టం ప్రకారం వెళ్ళాలి అని చెపుతున్నాం, అంతే కానీ ఎదో వ్యక్తిగత కారణాలతో మేము మాట్లాడటం లేదు అని చెప్పారు ప్రసన్న. (#Chiranjeevi #Balakrishna #WaltairVeerayya #VeerasimhaReddy #AshwiniDutt #AlluAravind)
Updated Date - 2022-11-25T13:41:48+05:30 IST