ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో పెళ్లికి సిద్ధమైన ప్రియుడు.. విషయం తెలిసి నేరుగా వధువు ఇంటికి వెళ్లిన ప్రేయసి.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN, First Publish Date - 2022-05-19T22:42:26+05:30

ఆమె రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. పెళ్లి చేసుకుంటాడనే భరోసాతో అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమలో ఉంది.. పెళ్లి చేసుకుంటాడనే భరోసాతో అతడితో శారీరక సంబంధం కూడా పెట్టుకుంది.. అయితే ఆ యువకుడు ఆమెను మోసం చేయాలనుకున్నాడు.. ఈమెను కాకుండా వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.. ఆ విషయం ప్రేయసికి తెలిసింది.. వెంటనే తన ప్రియుడిని పెళ్లి చేసుకోబోతున్న యువతి ఇంటికి వెళ్లింది.. జరిగిన విషయం మొత్తం చెప్పి పెళ్లి రద్దు చేయించింది.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

ఇది కూడా చదవండి..

అందంగా ముస్తాబై పెళ్లికి వధువు రెడీ.. వరుడు ఎంతకూ రాకపోవడంతో డౌట్.. ఫోన్ చేస్తే అవతలి వాళ్లు చెప్పింది విని..


ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతానికి చెందిన చిరంజీవి వర్మ అనే యువకుడు రెండేళ్లుగా ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నాడు. కానీ, ఆమెకు తెలియకుండా రహస్యంగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఆ విషయం చిరంజీవి ప్రేయసికి తెలిసింది. ఆమె నేరుగా చిరంజీవి పెళ్లి చేసుకోబోయే యువతి ఇంటికి వెళ్లింది. చిరంజీవి తనను ఎలా మోసం చేశాడో ఆమెకు వివరించింది. దీంతో ఆ యువతి చిరంజీవితో పెళ్లిని రద్దు చేసుకుంది. 


అనంతరం ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చిరంజీవిపై ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి చిరంజీవి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిరంజీవిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.  

Updated Date - 2022-05-19T22:42:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising