Bride collapsed: పెళ్లి వేదికపై విషాదం.. గుండెపోటుతో కుప్పకూలిన వధువు..!
ABN, First Publish Date - 2022-12-05T18:35:38+05:30
ఇటీవలి కాలంలో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా సామాన్యల నుంచి సెలబ్రిటీల వరకు ఎలాంటి ముందస్తు లక్షణాలూ లేకుండా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ నవ వధువు వివాహ వేదిక మీద గుండెపోటు బారిన పడి ప్రాణాలు విడిచింది.
ఇటీవలి కాలంలో గుండెపోటుతో (Heart Attack) అకస్మాత్తుగా మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎలాంటి ముందస్తు లక్షణాలూ లేకుండా హఠాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. తాజాగా ఓ నవ వధువు వివాహ వేదిక మీదే గుండెపోటు బారిన పడి ప్రాణాలు (Bride collapsed on Wedding stage) విడిచింది. కాళ్ల పారాణి ఆరక మునుపే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో (Lucknow) శనివారం రాత్రి జరిగింది.
లక్నోకు సమీపంలోని భద్వానా గ్రామానికి చెందిన షిమగి శర్మ వివాహం శనివారం రాత్రి జరిగింది. 21 ఏళ్ల షిమాగికి బుద్ధేశ్వర్ అనే యువకుడితో పెళ్లి జరిగింది. ఇరు కుటుంబాల బంధుమిత్రులు ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. వివాహం పూర్తయ్యాక వధూవరులు దండలు మార్చుకునేందుకు వేదిక ఎక్కారు. అందరి ఎదుటా ఇద్దరూ దండలు కూడా మార్చుకున్నారు. ఆ సమయంలో వధువుకు ఆకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో ఆమె కింద పడిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.
Updated Date - 2022-12-05T18:35:39+05:30 IST