ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందంగా ముస్తాబై పెళ్లికి వధువు రెడీ.. వరుడు ఎంతకూ రాకపోవడంతో డౌట్.. ఫోన్ చేస్తే అవతలి వాళ్లు చెప్పింది విని..

ABN, First Publish Date - 2022-05-19T18:15:14+05:30

ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి ముహూర్తం రోజు రానే వచ్చింది.. ఆమె అందంగా ముస్తాబై పెళ్లి దుస్తులు ధరించి కల్యాణ మండపానికి చేరుకుంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమెకు పెళ్లి కుదిరింది.. పెళ్లి ముహూర్తం రోజు రానే వచ్చింది.. ఆమె అందంగా ముస్తాబై పెళ్లి దుస్తులు ధరించి కల్యాణ మండపానికి చేరుకుంది.. వరుడి కుటుంబాన్ని ఆహ్వానించేందుకు వధువు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు.. అయితే ఎంత సేపటికీ వరుడి తరఫు వారు కల్యాణ మండపానికి రాలేదు.. వధువు తండ్రి ఫోన్ చేస్తే వరుడి తండ్రి బాంబు పేల్చాడు.. తమకు రూ.10 లక్షల అదనపు కట్నం, స్విఫ్ట్ కారు కావాలని, అవి ఇస్తేనే కల్యాణ మండపానికి వస్తామని చెప్పాడు. షాకైన వధువు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఇది కూడా చదవండి..

వీడసలు భర్తేనా.. పెళ్లయి 13 ఏళ్లు అవుతున్నా ఇదేం పాడు బుద్ధి.. స్నేహితులను ఇంటికి పిలిచి మరీ..



ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్ పూర్‌కు చెందిన షబానా అనే యువతికి ఏడాది క్రితం షాదిక్ అనే యువకుడితో నిశ్ఛితార్థం జరిగింది. ఈ నెల 15వ తేదీన పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నారు. వరుడికి ఇవ్వాల్సిన కట్నం, బైక్, ఇతర వస్తువులు రెండ్రోజుల ముందే ఇచ్చేశారు. 15వ తేదీన జరగాల్సిన పెళ్లి కోసం రూ.10 లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా ఏర్పాట్లు చేశారు. వరుడి కుటుంబాన్ని పెళ్లి రోజు ఉదయం 9.30 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అన్ని ఏర్పాట్లూ చేసుకుని వారి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. అయితే ఎంత సేపటికీ వరుడి కుటుంబ సభ్యులు కల్యాణ మండపానికి రాలేదు. 


వరుడి తండ్రికి వధువు తండ్రి ఫోన్ చేయగా షాకింగ్ విషయం తెలిసింది. తమకు అదనంగా రూ.10 లక్షల కట్నం, స్విఫ్ట్ కారు ఇస్తేనే కల్యాణ మండపంలో అడుగు పెడతామని వరుడి తండ్రి తేల్చిచెప్పాడు. దీంతో వధువు తరఫు వారందరూ షాకయ్యారు. వధువుతోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరకు వధువు తండ్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వరుడి కుటుంబంపై ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయమని వేడుకున్నారు. 

Updated Date - 2022-05-19T18:15:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising