ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gold Fish: అదృష్టం అంటే అది..! చేపల వేటకు వెళ్లిన జాలరికి జాక్‌పాట్.. ప్రపంచంలోనే అత్యంత భారీ గోల్డ్ ఫిష్..

ABN, First Publish Date - 2022-11-23T14:39:15+05:30

బంగారు రంగులో మెరిసిపోతూ అక్వేరియంలో తిరిగే గోల్డ్ ఫిష్‌లు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా చిన్న సైజులో ఉండే గోల్డ్ ఫిష్‌లు (Goldfish) చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఫ్రాన్స్‌ (France)లో ఓ జాలరికి ఏకంగా 30 కేజీల గోల్డ్ ఫిష్ దొరికింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంగారు రంగులో మెరిసిపోతూ అక్వేరియంలో తిరిగే గోల్డ్ ఫిష్‌లు చూపరులను బాగా ఆకట్టుకుంటాయి. చాలా చిన్న సైజులో ఉండే గోల్డ్ ఫిష్‌లు (Goldfish) చాలా అరుదుగా దొరుకుతుంటాయి. అలాంటిది ఫ్రాన్స్‌ (France)లో ఓ జాలరికి ఏకంగా 30 కేజీల గోల్డ్ ఫిష్ దొరికింది. అంత భారీ గోల్డ్ ఫిష్ తన వలలో పడటంతో ఆ జాలరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బ్రిటన్‌కు చెందిన ఆండీ హాకెట్ అనే మ‌త్స్య‌కారుడు సుమారు 31 కేజీల గోల్డ్‌ఫిష్‌ను ప‌ట్టుకున్నాడు. ఇది ప్ర‌పంచంలోనే అత్యంత బ‌రువైన గోల్డ్‌ఫిష్‌గా రికార్డు సృష్టిస్తోంది.

గ‌తంలో అమెరికాలోని మిన్న‌సొట్టాలో దొరికిన గోల్డ్‌ఫిష్ క‌న్నా ఇది సుమారు 14 కేజీల ఎక్కువ బ‌రువు ఉంది. ఫ్రాన్స్‌లోని చాంపేన్‌లో ఉన్న బ్లూవాట‌ర్ స‌ర‌స్సులో ఆండీ వ‌ల‌కు ఈ చేప చిక్కింది. లెద‌ర్ కార్ప్‌, కోయి కార్ప్‌కు చెందిన ఈ హైబ్రిడ్ ర‌క‌ం భారీ చేప నారింజపండు రంగులో మెరిసిపోతోంది. దాదాపు 25 నిమిషాల వేట త‌ర్వాత ఆండీకి గోల్డ్‌ఫిష్ దొరికింది. ప్రస్తుతం ఈ ఫిష్‌కి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇంత పెద్ద చేపను చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీని ధర కోట్లలో పలుకుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-11-23T14:39:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising