ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bronze Winged Jacana: జకానా భలే జాణ.. ప్రమాదాన్ని ఇట్టే పసిగడుతుంది.

ABN, First Publish Date - 2022-12-05T10:39:11+05:30

గాలిలో పొడవాటి రెక్కల్ని ఆడిస్తూ ఎగురుతాయి..

Bronze Winged Jacana
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెమలి అందం, నెమలి నడక, రూపంలో కాస్త నెమలిని పోలి ఉండే జకానా జకానిడే కుటుంబానికి చెందినది. ఇది దక్షిణ, ఆగ్నేయాసియా అంతటా కనబడుతుంది. నెమలి పోలికల జకానా మెటోపిడియస్ జాతికి చెందిన పక్షి. ఇతర జకానాల మాదిరిగానే ఇది లిల్లీస్, ఇతర తేలియాడే జల వృక్షాలను ఆహారంగా తీసుకుంటుంది, కొంగలాగా నీటిలో తేలియాడే నాచు మొక్కలపై నిలబడి పొడవాటి కాళ్ళు నీటిలో మునిగిపోకుండా ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కంఠం, రెక్కలు కాస్త నెమలి ఈకలు మాదిరిగానే మెరుస్తూ నీలం రంగులో కనిపిస్తాయి. నడక కూడా నెమ్మదిగా ఉంటుంది.

జకానా ఆడా మగ పక్షులు ఒకేలా కనిపిస్తాయి. కానీ ఆడపక్షులు కొంచెం పెద్దవిగా ఉంటాయి, తల, మెడ, నలుపు, నీలం రంగులో ఉంటాయి. వర్షాలలో సంతానోత్పత్తి కాలంలో మగపక్షులే గుడ్లను కాపాడే బాధ్యతను తీసుకుంటాయి. జకానా పక్షులు నీళ్ళపై మొక్కల్లో ఆహారం కోసం ఒంటరిగా, ఒక్కోసారి జంటగా కనిపిస్తాయి. నీటి మీద తేలియాడుతూ తమ పొడవాటి కాళ్లు, కాలి వేళ్లపై సమతుల్యం చేసుకుంటూ నిలబడతాయి.

ఇవి కీటకాలు, పురుగుల్ని, చిన్న చిన్న చేపల్ని తింటాయి. గాలిలో పొడవాటి రెక్కల్ని ఆడిస్తూ ఎగురుతాయి.. సీక్-సీక్-సీక్ అనే కూత పెడతాయి. ఏదైనా ప్రమాదం వచ్చిపడుతుందని పసిగట్టినప్పుడు మాత్రం ఇట్టే నీటిలో దాక్కుంటాయి. వీటికి వర్షాల తర్వాత సంతానోత్పత్తి కాలం ప్రారంభమవుతుంది.

కరువు, వర్షాల పరిస్థితులలో, ఇది కాలానుగుణంగా చిత్తడి నేలలు, ఉష్ణమండల చిత్తడి నేలలు, సరస్సులలో వృక్షసంపద కలిగిన చెరువుల దగ్గర కనిపిస్తాయి. వీటి గుడ్లు శంఖాకారంలో ఉంటాయి., గుడ్లు నలుపు జిగ్ జాగ్ గుర్తులతో నిగనిగలాడే గోధుమ రంగులో ఉంటాయి.

Updated Date - 2022-12-05T11:06:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising