ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

chanakya niti: అపజయం అనేది విజయాన్ని రుచికరంగా మార్చే మసాలా...

ABN, First Publish Date - 2022-12-21T07:22:59+05:30

అపజయం విజయానికి మొదటి మెట్టు అని అంటారు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం విజయం సాధించడానికి ఎటువంటి రహస్య సూత్రం లేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అపజయం విజయానికి మొదటి మెట్టు అని అంటారు. చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం విజయం సాధించడానికి ఎటువంటి రహస్య సూత్రం లేదు. ఇది లక్ష్యానికి అనుగుణంగా నడుచుకోవడం, కష్టపడి పనిచేయడం, వైఫల్యం నుండి నేర్చుకోవడం ద్వారా సాధ్యమవుతుందని చాణక్య తెలిపారు. విజయం అనేది వ్యక్తిని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, మనిషిని విజయం వైపు మూడు విషయాల గురించి తెలుసుకోవాలని చాణక్య సూచించారు.

ప్రయత్నం మానవద్దు

అపజయానికి భయపడి నిర్ణయాలను మార్చుకునే వ్యక్తి ఎప్పటికీ విజయం సాధించలేడని చాణక్యుడు చెప్పాడు. నిరాశ, అపజయాల గుండా విజయపథం సాగుతుందనేది చేదు నిజం. ఏదైనా పనిలో విఫలమైతే, నిరుత్సాహపడకుండా ప్రయత్నం కొనసాగించాలని చాణక్య తెలిపారు. మనిషి విజయం సాధించే వరకు ఆగకూడదు, ఎందుకంటే వైఫల్యానికి ప్రధాన కారణం కష్టపడి పనిచేయకపోవడమే. అపజయం అనేది విజయాన్ని రుచిగా మార్చే మసాలా అని చాణక్యుడు చెప్పాడు. కష్టపడి సాధించిన విజయం జీవితాన్ని సార్థకం చేస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు.

విమర్శలను విస్మరించండి

విమర్శలు మనసులో ప్రతికూల భావాలను కలిగిస్తాయి. విఫలమైతే విమర్శల గోల మొదలవుతుంది. విమర్శలను ఒక చెవితో విని, మరొక చెవి నుండి వదిలివేయడం మంచిదని ఆచార్య చాణక్య చెప్పారు. విమర్శించేవారిని విస్మరించండి. వారితో సంబంధం లేకుండా లక్ష్యం వైపు పయనిస్తూ ముందుకుసాగాలని చాణక్య తెలిపారు. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత... నిన్నటి వరకు మిమ్మల్ని విమర్శించే వారు మీ విజయాన్ని చూసి మిమ్మల్ని అభినందించేవారి జాబితాలో చేరిపోతారని చాణక్య తెలిపారు.

Updated Date - 2022-12-21T07:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising