ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cameras in School Toilets: బాత్రూంలలో సీసీ కెమెరాలు.. అధికారులు నిలదీస్తే స్కూలు యాజమాన్యం చెప్పిన కారణం విని..

ABN, First Publish Date - 2022-09-02T21:49:52+05:30

బాత్రూంలలో సీసీ కెమెరాలు అమర్చి.. తద్వారా బాలికలు, యువతులు, మహిళలను బెదిరించడం.. చివరకు వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. దీంతో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాత్రూంలలో సీసీ కెమెరాలు అమర్చి.. తద్వారా బాలికలు, యువతులు, మహిళలను బెదిరించడం.. చివరకు వారిపై అఘాయిత్యాలకు పాల్పడడం తరచూ చూస్తూనే ఉన్నాం. దీంతో ఏ ప్రాంతంలో ఏ కెమెరా ఉందో తెలీని పరిస్థితి నెలకొంది. ఇక పాఠశాలలో కూడా అప్పుడప్పుడూ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఉదంతమే వెలుగులోకి వచ్చింది. ఓ పాఠశాలలోని బాత్రూంలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనిపై అధికారులు పరిశీలించి వివరణ కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...


మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రత్లాంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్ (నామ్లీ) బాత్రూంలలో సీసీ కెమెరాలు (CC cameras) అమర్చారంటూ 10రోజుల క్రితం జాతీయ, రాష్ట్ర చైల్డ్‌లైన్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (Child Rights Commission) అధికారులు ఆగస్టు 30న పాఠశాలను తనిఖీ చేశారు. బాత్రూంలలో సీసీ కెమెరాలు అమర్చి ఉండడం చూసి పాఠశాల యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారంటూ వారిని ప్రశ్నించారు. దీనిపై యాజమాన్యం మాట్లాడుతూ.. విద్యార్థులు బాత్రూంలోకి వెళ్లిన సమయంలో అశ్లీల డ్రాయింగ్‌లు వేస్తున్నారని, అలాగే గోడలపై అసభ్యకర కామెంట్లు రాస్తున్నారని చెప్పారు.


దీనిపై పదే పదే ఫిర్యాదులు వస్తుండడంతో చివరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీనిపై చైల్డ్‌లైన్‌ అధికారులు మాట్లాడుతూ.. పిల్లలు తప్పు చేసిన సందర్భంలో తల్లితండ్రులను పిలిపించి చెప్పాలని, అంతేగానీ ఇలా చేయడం సరికాదని సూచించారు. ఇదిలావుండగా, జాతీయ బాలల కమిషన్ అధికారులు.. దీనిపై సీరియస్‌ అయ్యారు. ఇది చైల్డ్ పోర్నోగ్రఫీ కిందకు వస్తుందని, ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. 7రోజుల్లోగా వివరణ ఇవ్వాలని.. జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

బయటికెళ్లిన భర్త.. ఇంటికొచ్చేసరికే దారుణం.. బెడ్‌రూం తలుపులు తీసి చూడగా...


సెయింట్ జోసెఫ్ స్కూల్‌పై గతంలోనూ చాలా ఆరోపణలు వచ్చాయి. విద్యార్థులు భారత్ మాతా కీ జై.. అని నినదించినందుకు.. సస్పెండ్ చేశారని వివిధ హిందూ సంస్థ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు ఆందోళనలు కూడా చేశారు. అయితే సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడంతో విషయం సద్దుమణిగింది. అలాగే ఏడాది క్రితం మరో ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు తిలకం, కుంకుమ ధరించి పాఠశాలకు వచ్చారు. దీంతో వారిని పాఠశాలలోకి అనుమతించలేదు. అయితే పిల్లల తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ వివాదం కూడా అంతటితో ముగిసింది.

పెంచిన పాశాన్ని కర్కశంగా తెంచింది... ప్రియుడితో కలిసి పిన్నిని దారుణంగా..


అదే విధంగా ఎనిమిది నెలల క్రితం ఒడిశాకు చెందిన 11వ తరగతి విద్యార్థిని రాత్రి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కూడా ఆ సమయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు 2019  సెప్టెంబర్‌లో ఈ పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు విద్యార్థిని ఫొటోను మార్ఫింగ్ చేసి, తద్వారా బ్లాక్‌మెయిల్ చేశారు. రోజూ అఘాయిత్యానికి పాల్పడడంతో పాటూ డబ్బులు కూడా డిమాండ్ చేశారు. చివరకు ఆమె చెవి రింగులు కూడా వారికి ఇచ్చుకోవాల్సి వచ్చింది. చివరకు ఆమె తల్లికి ఈ విషయడంతో విషయం బయటపడింది. ప్రస్తుతం సీసీ కెమెరాల వ్యవహారం బయటపడడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దైవ దర్శనం కోసం రాష్ట్రం దాటి వచ్చిన కుటుంబం.. హోటల్ గది నుంచి ఉదయాన్నే బయటికి వెళ్లిన బాలిక.. ఐదు రోజుల తర్వాత..



Updated Date - 2022-09-02T21:49:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising