ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shocking Video: వైరల్‌గా మారిన ఆస్పత్రి వీడియో.. చైనాలో కరోనా కేసులు మరీ ఇంత దారుణంగానా..!

ABN, First Publish Date - 2022-12-20T15:23:50+05:30

మానవాళిని వణికించి, విలయం సృష్టించిన కరోనా మహమ్మారి (Corona Virus)ని ప్రపంచం ఇప్పుడిప్పుడే మరిచిపోతోంది. ఈ దశలో ప్రపంచ దేశాలను చైనాలో (China Corona virus cases) పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మానవాళిని వణికించి, విలయం సృష్టించిన కరోనా మహమ్మారి (Corona Virus)ని ప్రపంచం ఇప్పుడిప్పుడే మరిచిపోతోంది. ఈ దశలో ప్రపంచ దేశాలను చైనాలో (China Corona virus cases) పెరుగుతున్న కరోనా కేసులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. చైనాలో జీరో-కోవిడ్ పాలసీ నిబంధనలను సడలించడంతో కరోనా రక్కసి వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండడంతో ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోయాయి. వచ్చే మూడు నెలల్లో చైనాలో 60 శాతం మందికి పైగా కరోనా బారిన (60% Of China May Get Infected to Covid-19 in 3 months) పడతారని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫిగెల్ అంచనా వేస్తున్నారు.

రోగులతో పూర్తిగా నిండిపోయిన ఓ చైనా ఆస్పత్రికి (China Hospitals) సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో చైనాలో పరిస్థితిని కళ్లకు కడుతోంది. చైనాలో ప్రస్తుతం కరోనా మరణాలు (Covid-19 deaths) ఎక్కువగానే ఉన్నాయని, అయితే ఆ సంఖ్యను మాత్రం బయటకు రానివ్వడం లేదని ఎరిక్ పేర్కొన్నారు. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఇటీవల చైనా ప్రభుత్వం జీరో-కోవిడ్ పాలసీని (zero covid policy) ఎత్తేసింది. అప్పట్నుంచి రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. బీజింగ్‌లోని కొన్ని స్మశాన వాటికలు కోవిడ్ మృతులతో నిండిపోయాయని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఓ కథనం ప్రచురించింది. అలాగే ప్రధాన నగరాల్లో మందుల కొరత ఏర్పడినట్టు కూడా తెలిపింది.

Updated Date - 2022-12-20T15:23:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising