ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chirajeevi: చదువుకున్న కళాశాల కోసం..

ABN, First Publish Date - 2022-11-21T20:52:44+05:30

సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయడానికి చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటున్నారు. అంతే కాదు అభిమానులకు సైతం అండగా నిలబడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సేవా, అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేయడానికి చిరంజీవి (Chiranjeevi)ఎప్పుడూ ముందుంటారు. చిత్ర పరిశ్రమలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి ఆదుకుంటున్నారు. అంతే కాదు అభిమానులకు సైతం అండగా నిలబడతారు. ఈ మధ్యకాలంలో తన అభిమానుల భద్రత కోసం ‘చిరు భద్రత’ (Chiru bhadratha)పేరుతో ఇన్సూరెన్స్‌ వసతిని కల్పించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై చేతులమీదుగా ఆ ఇన్సూరెన్స్‌ కార్డులను అభిమానులకు అందజేశారు. తాజాగా ఆయన మరో అభివృద్ధి కార్యక్రమానికి ముందుకొచ్చారు. నరసాపురంలో ఆయన చదువుకున్న వైఎన్‌ఎం కాలేజ్‌ అభివృద్ధికి సహకరిస్తానని మాటిచ్చారు. 

ఆదివారం హైదరాబాద్‌లో వైఎన్‌ కాలేజ్‌ (Ynm college devolopment)పూర్వ విద్యార్ధుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి కూడా హాజరయ్యారు. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎంపీ నిధుల నుంచి వైఎన్‌ కాలేజ్‌ అభివృద్ధికి సాయపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా కళాశాలకు ఏ వసతి కావాలన్నా, దానికి ఎంత ఖర్చు అయినా వ్యక్తిగతంగా డొనేషన్‌ (Chiranjeevi donation)ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చిరంజీవి తెలిపారు. 


Updated Date - 2022-11-21T20:52:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising