రంగుల రాళ్లతో నిండిన పార్క్.. ఎక్కడుందో తెలుసా..
ABN, First Publish Date - 2022-11-13T20:47:38+05:30
పార్కు అంటే మొక్కలు, చెట్లు, పక్షులు, ఉడతలు, రాళ్లు, రప్పలు మామూలే. వీటన్నింటితో పాటు టెక్సాస్‌లోని ‘పార్ పార్క్’లో రంగుల రాళ్లు, రాచిప్పలూ కనిపిస్తాయి.
పార్కు అంటే మొక్కలు, చెట్లు, పక్షులు, ఉడతలు, రాళ్లు, రప్పలు మామూలే. వీటన్నింటితో పాటు టెక్సాస్‌లోని ‘పార్ పార్క్’లో రంగుల రాళ్లు, రాచిప్పలూ కనిపిస్తాయి. ఒకట్రెండు కాదండోయ్... దాదాపు 30 వేలు. విశేషమేమిటంటే అవి సహజమైన రంగు రాళ్లు కావు. పెయింట్ వేసినవి. ఈ ప్రయత్నం వెనక చిన్నకథ ఉంది. రాన్ ఓస్లెన్ అనే అతడు కరోనా సమయంలో ఇంట్లో ఊరికే కూర్చోకుండా గుళకరాళ్లకు పెయింట్ వేస్తూ... పక్కనే ఉన్న పార్కులోని వాక్ వేలో పెట్టాడు. అతడిని చూసి మిగతావారూ అదే పని చేయడం మొదలుపెట్టారు. ఆఖరుకి అత్యధికంగా రంగులు వేసిన రాళ్లున్న పార్కుగా అది గిన్నిస్ రికార్డులకూ ఎక్కింది. ‘మా పార్కుకి వచ్చేవారు ఇలాంటి రాళ్లను తీసుకురండి. ఇక్కడ ఉన్నవి మాత్రం తీసుకుపోకండి’ అని సదరు నగర పాలకసంస్థ ప్రకటించేసింది.
Updated Date - 2022-11-13T20:53:00+05:30 IST