ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Dil raju: ఎవరూ మాట వినరు.. ఎవరి దారి వారిదే!

ABN, First Publish Date - 2022-11-27T21:20:10+05:30

‘‘ఇండియాలోని అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా ఉండాలనేది నా లక్ష్యం’’ అని అంటున్నారు దిల్‌ రాజు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ ఇతర సమస్యల గురించి ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘ఇండియాలోని అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్‌గా ఉండాలనేది నా లక్ష్యం’’ అని అంటున్నారు దిల్‌ రాజు(Dil raju). అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో డిస్ట్రిబ్యూషన్‌ వ్యవస్థ ఇతర సమస్యల గురించి ఆయన మాట్లాడారు. తాజాగా ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ (Open heart with Rk)కార్యక్రమంలో పాల్గొన్నారు దిల్‌ రాజు. ఆసక్తికర విషయాలను వెల్లడించారు. (OHRK)

‘‘సినిమా ఇండస్ట్రీలో సక్సెస్‌ రేటు పది నుంచి ఇరవై శాతమే ఉంటుంది. నమ్మకంతో ముందుకెళ్లాలంతే. సినిమా ఎలా ఉందో చూపించకుండా అమ్మకం జరుగుతుంది. డిస్ట్రిబ్యూటర్లు ఆరుగురు, ఏడుగురు ఉన్నప్పుడు మేమందరం అదే సినిమా కావాలనుకుంటాం. డిస్ట్రిబ్యూషన్‌ అలాగే ఉంటుంది. ‘వారసుడు’ సినిమా నేను అన్ని ఏరియాల్లో అమ్మేశాను. నా మీద నమ్మకంతో కొంటారు. డిస్ట్రిబ్యూటర్‌కు ఛాయిస్‌ లేదే అనేది కరెక్ట్‌’’ అని అన్నారు. (Dil raju About Distribution)

"లైగర్‌, ఆచార్య సినిమాల విషయంలో డిస్ర్టిబ్యూటర్లు ధర్నాలు చేసే పరిస్థితి కూడా వచ్చింది కదా.. డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ కుప్పకూలిపోతే ప్రొడ్యూసర్‌కి కూడా కష్టమే కదా? అన్న ప్రశ్నకు.. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ ఎందుకు వెళ్లిపోతుందంటే, అందుకు ఉన్న సమస్య ప్రొడ్యూసర్లే! మంచి చేద్దాం అని వెళితే ఇండస్ట్రీలో మన మాట ఎవరూ వినరు. ఇక్కడ ఎవరి దారి వారిదే! ఇక్కడ డిస్ట్రిబ్యూటర్‌ వ్యవస్థ స్థిరపడిపోయింది. దానికొక సంస్కృతి ఉంది. విజయవాడ బేస్‌గా ఉన్న రోజుల్లో డిస్ట్రిబ్యూటర్‌ డబ్బు ఇస్తేనే ప్రొడ్యూసర్‌ సినిమా తీసేవాడు. ప్రొడ్యూసర్‌ వెళ్లి వాళ్లకు కథ చెప్పడం జరిగేది. నిర్మాతకు భయం ఉండేది. లాంగ్‌ రన్‌లో ప్రొడ్యూసర్‌లు నిలదొక్కుకోలేకపోవడానికి ఇదొక కారణం. ఇదొక సేఫ్‌ గేమ్‌ లాంటిది అయినా కొన్ని సందర్భాల్లో దెబ్బ తినక తప్పదు. ప్రొడ్యూసర్‌కు మార్జిన్‌ తక్కువ. వంద కోట్ల సినిమా అనుకుంటే, దాన్లో 100 బిజినెస్‌ అవుతుందని 95 నుంచి 98 ఖర్చు చేసేస్తున్నాం. ఆ మిగిలే మార్జిన్‌ చిన్నది. ఇలాంటి సేఫ్‌ గేమ్‌ సాధ్యపడనప్పుడు నష్టమే కదా? ఇప్పుడు సినిమా రిలీజ్‌ సమయానికి సెన్సార్‌ రూపంలో, ఇంకేదైనా రూపంలో సినిమా వీక్‌ అనే టాక్‌ వచ్చేస్తుంది. ఉదాహరణకు నేను కమిట్‌ అయి ఉంటే, సినిమా వీక్‌ అని తెలియగానే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కూడా బేరమాడడం మొదలుపెడతారు. దాంతో ఒక ప్రొడ్యూసర్‌గా నాకెప్పుడైనా ఒక రాంగ్‌ సినిమా పడ్డప్పుడు నేను కూడా నెగిటివ్‌లోకి వెళ్లిపోతూ ఉంటాను. అప్పుడిక డ్యామేజ్‌ తప్పదు. అలాగే ఫైనాన్స్‌ వడ్డీలు కూడా పెరుగుతూ ఉంటాయి" అని అన్నారు. 


Updated Date - 2022-11-27T21:20:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising