Viral Video: పావురాన్ని వేటాడేందుకు పొంచివున్న పిల్లి.. తీరా దగ్గరికి వెళ్లి.. ఏం చేసిందో మీరే చూడండి...
ABN, First Publish Date - 2022-05-28T02:46:06+05:30
వేట దొరికితే ఎవరైనా వదిలిపెడతారా..! అంటే నో అని సమాధానం చెబుతాం. మనుషులకైతే మానవత్వం ఉంటుంది కాబట్టి.. అప్పుడప్పుడూ కనికరం చూపిస్తారు. కానీ జంతువులు మాత్రం..
వేట దొరికితే ఎవరైనా వదిలిపెడతారా..! అంటే నో అని సమాధానం చెబుతాం. మనుషులకైతే మానవత్వం ఉంటుంది కాబట్టి.. అప్పుడప్పుడూ కనికరం చూపిస్తారు. కానీ జంతువులు మాత్రం సాధారణంగా వదిలిపెట్టవు. వేట దొరకడమే ఆలస్యం.. ఇలా దాడి చేసి, అలా నోట కరుచుకుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే పిల్లి మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. పావురాన్ని వేటాడేందుకు చాలా సేపటి నుంచి పొంచి ఉంది. అయితే తీరా దగ్గరికి వెళ్లి.. అది చేసిన పనిని చూసిన నెటిజన్లు వావ్.. ఈ పిల్లి వెరైటీగా ఉందే అని అంటున్నారు...
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. వేట కోసం పిల్లి పొంచి ఉంటుంది. అదే సమయంలో దానికి కొంచెం దూరంలో ఓ పావురం వచ్చి వాలుతుంది. ఇంకేముందీ.. పంట పండింది అని అనుకుంటుంది. ఎలాగైనా తినేయాలని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్తుంది. అయితే పిల్లి వస్తున్న విషయం పావురానికి తెలిసినా.. ఎగిరిపోకుండా అలాగే ఉండిపోతుంది. మెల్లగా పావురం దగ్గరికి వెళ్లిన పిల్లి.. ఒక్కసారిగా మనసు మార్చుకుంటుంది. పావురం ధైర్యం నచ్చిందో, లేక దానిపై జాలి కలిగిందో ఏమో తెలీదు గానీ దగ్గరికి వెళ్లి.. ఒక్కసారిగా దాని తలపై కిస్ చేస్తుంది. అయినా పావురం ఏమాత్రం కదలకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో ఇదే పావురం రా నాయనా.. నేనంటే కొంచెం కూడా భయం లేదు.. అన్నట్లుగా పిల్లి రియాక్షన్ ఇస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి..
Updated Date - 2022-05-28T02:46:06+05:30 IST