ATM Pin Number: ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కేవలం 4 అక్షరాలే ఎందుకు ఉంటాయి..? అసలు కారణాలివే..!
ABN, First Publish Date - 2022-09-30T02:12:04+05:30
క్యాష్ విత్‌డ్రా.. ఒకప్పుడు ఇది పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. బ్యాంక్‌కు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిల్చుని, పేపర్లు నింపి ఇస్తే గానీ డబ్బు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇక అత్యవసర..
క్యాష్ విత్‌డ్రా.. ఒకప్పుడు ఇది పెద్ద ప్రయాసతో కూడుకున్న పని. బ్యాంక్‌కు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిల్చుని, పేపర్లు నింపి ఇస్తే గానీ డబ్బు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు. ఇక అత్యవసర సమయాల్లో డబ్బు కావాలనే వారి ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అయితే రాను రాను టెక్నాలజీ పెరిగిపోవడంతో ఏటీఎం మిషిన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఏటీఎం కార్డు తీసుకుని.. ఇలా వెళ్లి, అలా డబ్బు తీసుకుని బయటికి వచ్చే వెసులుబాటు వచ్చింది. అయితే నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగిపోవడంతో పాటూ ఫోన్‌పేలు, గూగుల్ పే, పేటీఎం (Phonepay, Google, Paytm) ద్వారా లావాదేవీలు జరపడం పెరిగిపోయింది. ఈ విషయం పక్కన పెడితే.. అసలు ఏటీఎం కార్డుకు నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు ఉంటాయని చాలా మంది ఆలోచించి ఉండరు. అసలు నాలుగు అంకెలు మాత్రమే ఎందుకు పెట్టారనే వివరాల్లోకి వెళితే...
స్కాటిష్ శాస్త్రవేత్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్ (John Adrian Shepherd Baron) .. 1969లో ATM యంత్రాన్ని (ATM machine) కనుగొన్నారనే విషయం తెలిసిందే. మొదట్లో ఏటీఎం పిన్ 6 నంబర్లతో ఉండేది. అయితే ఈ విధానం వల్ల చాలా మంది పిన్ నంబర్ మరచిపోవడం జరుగుతుండేది. ఈ విషయంలో ఎక్కువ మంది నుంచి ఫిర్యాదులు రావడంతో అంతా సులువుగా గుర్తుంచుకునేందుకు వీలుగా ఉండేలా నాలుగు నంబర్లకు కుదించారు. అయితే ఆరు నెంబర్లు ఉండడం వల్ల గుర్తుంచుకోవడం ఇబ్బంది అయినా.. ఈ నంబర్‌ను హ్యాక్ చేయడం చాలా కష్టం. ఇక, ఏటీఎం ఆవిష్కర్త జాన్ అడ్రియన్ షెపర్డ్ బారన్.. ఇండియాలో జన్మించారనే విషయం చాలా మందికి తెలీదు. మేఘాలయ షిల్లాంగ్‌లో 1925లో ఆయన జన్మించారు. ప్రపంచవ్యాప్తంగా క్యాష్ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేసిన తర్వాత.. దాదాపు 53 ఏళ్ల తర్వాత తొలిసారిగా అడ్రియన్ షెపర్డ్ జన్మించిన మేఘాలయలోని ఓ ఆస్పత్రిలో తొలిసారిగా మెషిన్‌ను అమర్చారు.
శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..!
Updated Date - 2022-09-30T02:12:04+05:30 IST