ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Super Star Krishna: కృష్ణ మరణం.. డాక్టర్లు ఏమన్నారంటే..!

ABN, First Publish Date - 2022-11-15T11:10:47+05:30

తెలుగుతెర నట శేఖరుడు సూపర్‌స్టార్‌ కృష్ణ కన్ను మూశారు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుతో ఆస్పత్రి లో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుతెర నట శేఖరుడు(Nata sekhar krishna) సూపర్‌స్టార్‌ కృష్ణ (Superstar krishna)కన్ను మూశారు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుతో (Heart attack)ఆస్పత్రి లో చేరిన ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మొదట గుండెపోటు, తదుపరి మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల కృష్ణ మరణించినట్లు కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంటినెంటల్‌ ఆస్పత్రి ఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కృష్ణ గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చారు. వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్‌ చేశాం. ఆ తర్వాత చికిత్స చేయడం ప్రారంభించాం. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే (Critical condition)ఉంది. రెండు  మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరం కావడంతో అదీ చేశాం. హైపోక్సిక్‌ బ్రెయిన్‌ ఇన్‌జ్యూరీకి కూడా చికిత్స అందించాం. ఆ పరిస్థితిలో ఎలాంటి వైద్యం చేయాలో ఆ ప్రయత్నాలన్నీ మా వైద్య బృందంతో చేశాం. కృష్ణకు అందిస్తున్న వైద్యం గురించి ఎప్పటికప్పుడు  కుటుంబ సభ్యులకు తెలియజేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని వైద్యులు నిర్థారణకు వచ్చారు. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచారు.  ఆయన భౌతికకాయాన్ని కుటుంబానికి అప్పగించాం. మిగిలిన విషయాలు కుటుంబ సభ్యులు వెల్లడిస్తారు’’ అని అన్నారు. ప్రస్తుతం కృష్ణ భౌతికకాయం నానక్‌రామ్‌గూడలోని స్వగృహంలో ఉంచారు. అభిమానుల సందర్శనార్ధం ఆయన భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియం లేదా హైటెక్స్‌ గ్రౌండ్‌లో ఉంచుతారని సమాచారం. 

- యు. వినాయకరావు 

Updated Date - 2022-11-15T11:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising