ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: ఈ ఒక్క సమోసా తింటే.. రూ.51వేలు మీ సొంతం!

ABN, First Publish Date - 2022-10-30T11:36:31+05:30

ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలపై ఆసక్తి చూపడం లేదు. సొంతంగా వ్యాపారం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో కూడా విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. దీంతో వ్యాపారులు.. ప్రజలను ఆకర్షించడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ మిఠాయి కొట్టు యజమాని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చాలా మంది ఉద్యోగాలపై ఆసక్తి చూపడం లేదు. సొంతంగా వ్యాపారం పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే వ్యాపారంలో కూడా విపరీతంగా కాంపిటీషన్ పెరిగిపోయింది. దీంతో వ్యాపారులు.. ప్రజలను ఆకర్షించడానికి వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ మిఠాయి కొట్టు యజమాని.. ఆహార ప్రియుల కోసం ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. కేవలం ఒక్క సమోసా తిని.. రూ.51వేలు గెలుచుకునే అవకాశం కల్పించారు. అయితే.. ఇక్కడ ఒక చిన్న టిస్ట్ ఉంది. ఏంటా ట్విస్ట్? అని అనుకుంటున్నారా? అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

రూ.51వేలు గెలవాలంటే.. మీరు తినాల్సింది బయట కనిపించే సాధారణ సమోసాను కాదు. బాహుబలి సమోసా(Bahubali samosa)ను. ఈ బాహుబలి సమోసా.. బరువు 8కేజీల వరకు ఉంటుంది. దీన్ని ఎవరైతే 30 నిమిషాల్లో తింటారో వాళ్లు రూ.51వేలను గెలుచుకోవచ్చు. ఈ సమోసా ఖరీదు కూడా భారీగానే ఉందడోయ్. 8 కేజీల ఈ సమోసా ధర అక్షరాలా రూ.1,100. అయినా సరే ఓ సారి ట్రై చేస్తాం అనుకునే వాళ్లు.. మీరట్‌(Meerut)లోని కౌశల్ స్వీట్ షాప్‌ను సందర్శిచొచ్చు. ఇప్పటి వరకు దాదాపు 30 మంది ప్రయత్నించి ఛాలెంజ్‌లో ఓటమి చెందారట.

కాగా.. ఈ బాహుబలి సమోసా(Bahubali samosa)కు సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా దాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం అదికాస్తా వైరల్‌గా మారింది.

Updated Date - 2022-10-30T12:18:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising