Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానానికి పడిపోయిన మస్క్.. అగ్రస్థానంలో ఎవరంటే..
ABN, First Publish Date - 2022-12-14T16:04:05+05:30
గత కొంత కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. తాజాగా ప్రపంచ సంపన్నుల (world's richest man) జాబితాలో బెర్నార్డ్ అర్నాల్ట్ (Bernard Arnault) అగ్రస్థానంలోకి ఎగబాకారు.
గత కొంత కాలంగా ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) తాజాగా తన స్థానాన్ని కోల్పోయారు. తాజాగా ప్రపంచ సంపన్నుల (world's richest man) జాబితాలో బెర్నార్డ్ అర్నాల్ట్ (Bernard Arnault) అగ్రస్థానంలోకి ఎగబాకారు. లూయిస్ విట్టాన్ (Louis Vuitton) కంపెనీ LVMH సీఈవో అయిన బెర్నార్డ్ తాజాగా మస్క్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం.. బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.
ఈ ఏడాది ఎలన్ మస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. టెస్లా సీఈవో మస్క్ ఇటీవల 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విటర్ (Twitter)ను కొనుగోలు చేశారు. అందుకోసం టెస్లా (Tesla)లోని 15 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. అప్పట్నుంచి టెస్లా షేర్లు పడిపోవడం ప్రారంభమైంది. దాని వల్ల ఆయన సంపద భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది టెస్లా, అమేజాన్, మెటా మొదలైన టెక్ కంపెనీలన్నీ నష్టాలను మూట కట్టుకున్నాయి. దీంతో బెర్నార్డ్ అగ్రస్థానం దక్కించుకున్నారు.
Updated Date - 2022-12-14T16:04:07+05:30 IST