ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీనివాస రామానుజన్ మళ్లీ పుట్టారా..? ఈ బాలుడు చదివేది 3వ తరగతే.. కానీ పదో తరగతి విద్యార్థులకు కూడా లెక్కల పాఠాలు..!

ABN, First Publish Date - 2022-09-29T21:46:52+05:30

కొందరు పిల్లలు (children) చిన్నతనం నుంచే అమితమైన తెలివితేటలు కలిగి ఉంటారు. పిల్లలు పెద్దవారు కూడా చేయలేని పనులను అవలీలగా చేసేస్తుంటారు. కొందరు ఆటల్లో ప్రతిభ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు పిల్లలు (children) చిన్నతనం నుంచే అమితమైన తెలివితేటలు కలిగి ఉంటారు. పిల్లలు పెద్దవారు కూడా చేయలేని పనులను అవలీలగా చేసేస్తుంటారు. కొందరు ఆటల్లో ప్రతిభ కనబరిస్తే.. మరికొందరు పిల్లలు చదువులో అత్యంత ప్రతిభ కనబరుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇలాంటి వారిని చూసినప్పుడు.. పిట్ట కొంచెం కూత ఘనం, పిల్లలు కాదు పిడుగులు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. వంటి సామెతలు గుర్తుకొస్తుంటాయి. ప్రస్తుతం ఓ బాలమేధావి తెలివితేటలు చూసిన వారంతా ఈ సామెతలను గుర్తు చేసుకుంటున్నారు. మూడో తరగతి చదివే ఈ బుడ్డోడు ఏకంగా పదో తరగతి విద్యార్థులకు లెక్కల పాఠాలు చెబుతున్నాడు. ఈ బాలుడ్ని చూసిన వారంతా శ్రీనివాస రామానుజన్ (Srinivasa Ramanujan) మళ్లీ పుట్టారా.. అని అవాక్కవుతున్నారు..


బీహార్ (Bihar) పాట్నా (Patna) మసౌధి పరిధి చాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ మహ్తో అనే వ్యక్తికి భార్య, సోను బీహార్ అనే మూడో తరగతి చదివే కొడుకు ఉన్నారు. రాజ్‌కుమార్ వృత్తిరీత్యా లెక్కల టీచర్. ఆ ప్రభావమో ఏమో గానీ అతడి కుమారుడు సోను బీహార్ చిన్నప్పటి నుంచే లెక్కల్లో ఆరితేరిపోయాడు. ఎంతగా అంటే మూడో తరగతి చదువుతున్న ఈ బుడ్డోడు.. ఏకంగా పదో తరగతి చదివే విద్యార్థులకు లెక్కలు నేర్పిస్తున్నాడు. పదో తరగతి (10th class) వరకు అన్ని క్లాసులకు సంబంధించిన లెక్కలు, సూత్రాలను.. ఇలా అడగ్గానే.. అలా చెప్పేస్తున్నాడు. ఇతడి ప్రతిభను చూసి టీచర్లే అవాక్కవుతున్నారు. చిన్నప్పటి నుంచి తండ్రి చెప్పిన పాఠాలతో పెరగడం వల్ల ఇంతటి ప్రతిభ సొంతమయిందని స్థానికులు చెబుతున్నారు.

నా పిల్లలు నాకు కావాలి.. ఎవరో ఎత్తుకెళ్లారంటూ పోలీసుల ముందు ఏడ్చిందో తల్లి.. 5 రోజుల తర్వాత ఏం తేలిందంటే..


సోనూ తండ్రి ప్రస్తుతం ఇంటి వద్దే పిల్లలకు ట్యూషన్ చెబుతుంటాడు. ట్యూషన్‌కి వచ్చే పదో తరగతి విద్యార్థులకు లెక్కల్లో ఏ సందేహం వచ్చినా.. సోనూను అడిగి తెలుకుంటుంటారు. ఈ బాలుడు లెక్కలు చెప్పే విధానం కూడా చాలా ఆసక్తిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఉపాధ్యాయులు చెప్పే విధానానికి భిన్నంగా ఎంతో ఓర్పుగా, వివరంగా బోధించడం అందరినీ ఆకట్టుకుంటోంది. చాలా మంది విద్యార్థులు స్థానికంగా హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటుంటారు. వారంతా సోను బీహార్ వద్దకు వచ్చి లెక్కలు నేర్చుకుంటుంటారు. ఈ బుడ్డోడి ప్రతిభ గురించి ఆనోటా, ఈనోటా పడి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం వ్యాపించింది. దీంతో పలువురు ఇక్కడికి వచ్చి సోనూ బిహార్ ప్రతిభను చూసి ముచ్చటపడుతున్నారు. స్థానికంగా సోనూను గణిత మాంత్రికుడు, చోటే ఖాన్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటారు.

కన్నతల్లిని రాత్రి పూట నడిరోడ్డు మీద వదిలేసిన తండ్రికి.. కలలో కూడా ఊహించని షాకిచ్చిన కొడుకు.. ఆ మనవడికి హ్యాట్సాఫ్..!



Updated Date - 2022-09-29T21:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising