ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లయినప్పటి నుంచి దిగులుగా ఉంటున్న యువతి.. మూడు నెలల తర్వాత.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి...

ABN, First Publish Date - 2022-04-29T19:03:43+05:30

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే వైవాహిక జీవితం.. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. ప్రేమ వ్యవహారం కారణంగా కొందరు, వేధింపుల కారణంగా...

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లంటే నూరేళ్ల పంట అని పెద్దలు అంటూ ఉంటారు. అయితే వైవాహిక జీవితం.. ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో ఎవరికీ తెలీదు. ప్రేమ వ్యవహారం కారణంగా కొందరు, వేధింపుల కారణంగా మరికొందరు విడిపోవడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ని సమస్యలు ఎదురైనా దంపతులు మళ్లీ యథావిధిగా కలిసిపోతుంటారు. అయితే కొందరు దంపతులు మాత్రం చిన్న చిన్న సమస్యలకే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటుంటారు. తమిళనాడులో ఓ యువతి ఇలాగే చేసింది. పెళ్లయినప్పటి నుంచి దిగులుగా ఉన్న ఆమె.. మూడు నెలల తర్వాత చేసిన పని.. స్థానికంగా సంచలనం కలిగించింది.


తమిళనాడు తిరువొత్తియూరు పరిధి పుదుక్కోట్టై జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని కొప్పరపుపట్టికి చెందిన పుష్పరాజ్‌కు, ఆరియన్‌కాడు గ్రామానికి చెందిన దీప(25)కు మూడు నెలల క్రితం వివాహమైంది. కొత్తగా పెళ్లయిన దంపతులు ఎంత ఆనందంగా ఉంటారో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ యువతిలో మాత్రం ఎలాంటి ఆనందం లేదు. ఆమె దిగులుగా ఉండడం చూసి.. కొన్నాళ్లు పోతే అలవాటు అవుతుందిలే అనుకుని భర్తతో పాటూ అత్తమామలంతా సర్దుకుపోయేవారు. కానీ ఆమె మాత్రం నిత్యం దిగులుగా కనిపిస్తూ ఉండేది.

దండలు మార్చుకున్న వధూవరులు.. అనంతరం స్నేహితులంతా కలిసి వధువును ఓ గది తీసుకెళ్లగా... మరుక్షణమే ఊహించని ఘటన...


ఈ క్రమంలో గత గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో అసలు వాస్తవాలు బయటపడ్డాయ. మృతురాలు దీప.. పెళ్లికి ముందే వేలుసామి అనే యువకుడిని ప్రేమించేదని తెలిసింది. ఈ క్రమంలో ఆమెకు ఇష్టం లేకున్నా పెళ్లి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కూరగాయలు తెస్తానని వెళ్లిన భార్య.. రాత్రైనా రాకపోవడంతో డౌట్.. ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పింది విన్న ఆ భర్తకు..

Updated Date - 2022-04-29T19:03:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising