ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే..

ABN, First Publish Date - 2022-07-01T23:38:51+05:30

మహిళ కనబడితే.. ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంటారు కొందరు దుర్మార్గులు. ముందు నమ్మకం కలిగేలా మాటలు చెప్పి.. చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళ కనబడితే.. ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని చూస్తుంటారు కొందరు దుర్మార్గులు. ముందు నమ్మకం కలిగేలా మాటలు చెప్పి.. చివరకు దారుణంగా మోసం చేస్తుంటారు. ఉత్తరాఖండ్‌లో ఇలాగే జరిగింది. తల్లీకూతుళ్లు కలిసి రాత్రి వేళ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో కొందరు యువకులు.. కారులో అటుగా వచ్చారు. రండి మేడం.. మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ కారులో ఎక్కించుకున్నారు. కాస్త ముందుకు ముందుకు వెళ్లగానే, డోర్స్ లాక్ చేసి దారి తప్పించారు. చివరకు వారు చేసిన దారుణం.. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..


ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా రూర్కీ ప్రాంతంలో గత శుక్రవారం రాత్రి వేళ.. ఓ మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తోంది. చాలా సేపటికి కొందరు యువకులు అటుగా కారులో వచ్చారు. రోడ్డుపై వీరిని గమనించిన యువకులు కారును ఆపి.. రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అనడంతో మహిళ వారిని నమ్మి, కారు ఎక్కింది. కారు కొంచెం దూరం వెళ్లగానే.. డోర్స్ లాక్ చేసి దారి తప్పించారు. దీంతో, ఏంటిది.. ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. అని మహిళ ప్రశ్నించింది. అయినా వారు వినిపించుకోకుండా.. గట్టిగా ఆమె నోరు మూసి, కదులుతున్న కారులోనే ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఆరేళ్ల చిన్నారిపై కూడా అఘాయిత్యానికి పాల్పడ్డారు.

పెరుగు తేవడానికి వెళ్లిన భర్త.. ఇంటికి చేరుకునేలోపు లోపలి నుంచి కటింగ్ మిషన్ శబ్ధాలు.. తీరా కిటికీ తలుపు తీసి చూస్తే..


ఇలా చాలా సేపటి తర్వాత.. వారిద్దరినీ ఓ ప్రాంతంలో దింపేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు... బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని.. సంఘటన స్థలంలో చాలా మందిని విచారించారు. సీసీ టీవీ ఫుటేజీ, నిందితుల పోన్, కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ఐదుగురు నిందితులనూ గురువారం అరెస్ట్ చేశారు. బాధితురాలు భిక్షాటన చేస్తూ.. కుమార్తెను పోషిస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కడుపునొప్పి అని కూతుర్ని ఆస్పత్రికి తీసుకెళ్తే గర్భవతి అని చెప్పిన డాక్టర్లు.. ఏం జరిగిందని ఆ తల్లి ఏడుస్తూ అడిగితే..

Updated Date - 2022-07-01T23:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising