ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Super Star Krishna: ఇక సెలవు

ABN, First Publish Date - 2022-11-16T16:08:13+05:30

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సూపర్ స్టార్‌ను కడసారి చూసేందుకు అభిమానులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. సూపర్ స్టార్‌ను కడసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ కడసారి వీడ్కోలు పలికారు. కృష్ణకు కుమారుడు మహేష్ బాబు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. ఇక కృష్ణ లేరనే విషయాన్ని జీర్ణంచుకోలేకపోతున్న ఆయన అభిమానులు.. ఒక సందర్భంలో తన కుటుంబానికి గుడ్‌బై చెబుతున్న ఆయన ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సూపర్ స్టార్‌కు వీడ్కోలు పలుకుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో టాలీవుడ్ మొదటి తరం స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణల శకం ముగిసింది. వారు మరణించినా.. వారి సినిమాలతో, జ్ఞాపకాలతో, చేసిన సేవలతో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే మిగిలుంటారు.

భువి నుండి నింగికెగసిన ధ్రువతార

తనదైన నటనతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న సూపర్‌ స్టార్‌ కృష్ణ (80) అస్తమించారు. తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు, శరీరంలోని కీలక అవయవాల వైఫల్యం (మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌)తో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్‌ చేసి ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. సోమవారం ఉదయం ఆరోగ్యం కాస్తా నిలకడగా ఉన్నప్పటికీ రెండు, మూడు గంటల తర్వాత ఆయన పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. అవయవాల పనితీరు మందగించింది. మెదడుకు రక్తస్రావం నిలిచిపోవడంతో పనితీరు ఆగిపోయి.. ఆ ప్రభావం మూత్రపిండాలు, ఊపిరితిత్తుల మీద పడింది. కిడ్నీల పనితీరును మెరుగుపరిచేందుకు డయాలసిస్‌ చేశారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. సోమవారం రాత్రి 7 గంటల నుంచి ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. వైద్య చికిత్సకు ఆయన శరీరం స్పందించ లేదు. గుండెపోటు, మల్టీఆర్గాన్‌ ఫెయిల్యూర్‌తో కృష్ణ మృతిచెందినట్లు ఆస్పత్రి సీఎండీ డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి పేర్కొన్నారు. చివరి క్షణాల్లో నొప్పి తాలూకు బాధ తెలియకుండా ఆయన మనశ్శాంతిగా కన్నుమూసే విధంగా వైద్యనీతిని పాటించినట్లు చెప్పారు. ఆయన కుమారుడు, సినీ హీరో మహేశ్‌బాబు, ఇతర కుటుంబసభ్యులు, కృష్ణ చివరి క్షణాల్లో ఆయన చెంతే ఉన్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ ఇకలేరన్న వార్త తెలిసి సినీరంగ ప్రముఖులు దిగ్భ్రాంతి చెందారు. పార్థివ దేహాన్ని సందర్శించేందుకు సినీ ప్రముఖుల్లో కొందరు కాంటినెంటల్‌ హాస్పిటల్‌కు తరలివెళ్లగా.. మరికొందరు నానక్‌రామ్‌గూడలోని ఆయన స్వగృహానికి వచ్చారు. కృష్ణ మృతదేహాన్ని కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి మధ్యాహ్నం 12:08 గంటలకు అంబులెన్స్‌లో నానక్‌రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. అంబులెన్స్‌ లోపలికి వెళ్తున్న సమయంలో అభిమానులు ‘సూపర్‌స్టార్‌ కృష్ణ.. అమర్‌రహే’ అంటూ నినాదాలు చేశారు. కృష్ణ పార్థిక దేహాన్ని అభిమానుల సందర్శనార్థం బుధవారం ఉదయం పద్మాలయా స్టూడియోకి తరలించారు. అనంతరం 12 గంటల నుండి అంతిమయాత్ర మొదలైంది. 3 నుండి 4.30 గంటల మధ్య కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

అభిమానులకు, ప్రేక్షకులకు కృష్ణ ఏం చెప్పారంటే..

‘‘మేం దేవుళ్లం కాదు. కేవలం నటులం. ప్రేక్షకులకు వినోదం, కాలక్షేపం అందించడమే మా వృత్తి. హీరోల కోసం ఎవరూ కొట్టుకోకూడదు. మా కోసం పనులన్నీ మానేసి సినిమాలు చూడాల్సిన పనిలేదు. మీ తీరిక వేళల్లో, మీ కాలక్షేపం కోసం మాత్రమే సినిమాలు చూడండి. సినిమాని కేవలం సినిమాగా మాత్రమే చూడండి’‘

Updated Date - 2022-11-16T16:24:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising