ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral News: కోట్ల ఆస్తి.. అద్దెరూపంలోనే నెలకు లక్షన్నర వస్తుంది.. అయినా భిక్షాటన.. అతడు అలా ఎందుకు చేస్తున్నాడంటే..

ABN, First Publish Date - 2022-12-03T10:54:09+05:30

విజయ్ ఆంథోని 'బిచ్చగాడు' మూవీ గుర్తుంది కదా. అందులో హీరో కోటీశ్వరుడైనా కొన్ని రోజులు బిచ్చగాడిగా బతుకుతాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: విజయ్ ఆంథోని 'బిచ్చగాడు' మూవీ గుర్తుంది కదా. అందులో హీరో కోటీశ్వరుడైనా కొన్ని రోజులు బిచ్చగాడిగా బతుకుతాడు. అందుకు చాలా బలమైన కారణాన్నే ఈ మూవీలో చూపించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఓ వ్యక్తి కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. లండన్‌లో ఉండే సదరు వ్యక్తికి ఏకంగా ఐదు కోట్లకు పైగా విలువ చేసే ఆస్తి ఉంది. నెలకు అతనికి అద్దెరూపంలోనే సుమారు లక్షన్నర వరకు వస్తుంది. అయినా మనోడు భిక్షాటన చేస్తుంటాడు. అలా వచ్చిన డబ్బులతోనే పబ్బం గడుపుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే.. రోజంతా బిచ్చం ఎత్తి వచ్చిన డబ్బులతో జల్సా చేయడం, ఆ తర్వాత ఫుట్‌పాత్‌పైనే పడుకోవడం చేస్తుంటాడు. కోట్ల ఆస్తి ఉన్న అతగాడు అసలు ఎందుకు ఇలా అయ్యాడు? బిచ్చం ఎత్తుకుంటూ ఫుట్‌పాత్‌లపై పడుకోవాల్సి ఎందుకు వచ్చింది? తదితర వివరాలు తెలియాలంటే మనం అతడి పూర్తి కథ తెలుసుకోవాల్సిందే.

అతడి పేరు డోమ్. బ్రిటన్ రాజధాని నగరం లండన్‌లో ఉంటాడు. అతనికి రూ.5కోట్లు విలువ చేసే అందమైన భవంతి ఉంది. దానికి అద్దె రూపంలో నెలకు రూ. 1.27లక్షల వరకు వస్తుంది. అయినా డోమ్ భిక్షాటన చేస్తూ జీవిస్తు్న్నాడు. దీనికి కారణం అతనికి ఉన్న చేడు వ్యసనాలే. డోమ్‌కు చిన్నప్పటి నుంచి సరిగ్గా విద్య అబ్బలేదు. కానీ, మనోడు అథ్లెటిక్స్‌లో మాత్రం చురుగ్గా ఉండేవాడు. దాంతో నెలవారీ స్కాలర్షిప్ వచ్చేది. ఇంకేముంది అలా వచ్చిన డబ్బులతో జల్సాగా తిరిగడం మొదలెట్టాడు. ఈ క్రమంలో 13 ఏళ్ల వయసు నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. వయసు పెరిగిన కొద్ది ఇతర అలవాట్లు కూడా ఒకదాని తరువాత ఒకటి అతని చుట్టూ చేరాయి. ఒకనొక దశలో డోమ్‌కు లేని చేడు వ్యసనాలంటూ లేవట. దాంతో అతడి పరిస్థితి చూసి కలత చెందిన తల్లిదండ్రులు పెళ్లి చేస్తేనన్నా.. డోమ్‌లో మార్పు వస్తుందని ఆలోచించి ఆ తంతు కాస్తా జరిపించారు. ఇక వివాహం తర్వాత కొన్నాళ్లు అతడు చేడు అలవాట్లుకు దూరంగా ఉన్నాడు. కానీ, అలా ఎంతోకాలం ఉండలేకపోయాడు. మళ్లీ డ్రగ్స్ తీసుకోవడం మొదలెట్టాడు. దాంతో భార్య వదిలేసి వెళ్లిపోయింది.

మళ్లీ పేరెంట్స్‌కు డోమ్ భవిష్యత్తు అగమ్యగోచరంగా తోచింది. ఎలాగో మనోడు మారడు అని నిర్ధారించుకున్న తల్లిదండ్రులు.. అతడి భవిష్యత్‌‌ను దృష్టిలో పెట్టుకుని ఓ ఇల్లు కొనిచ్చారు. ఇప్పుడు ఆ ఇంటి విలువ ఐదు కోట్లకు పైనే ఉంటుంది. ప్రస్తుతం ఇంటి అద్దె రూపంలో డోమ్‌కు సుమారు రూ. 1.27లక్షలు వస్తున్నాయి. కానీ, అతడి డ్రగ్స్ అలవాటుకు ఈ అద్దె డబ్బులు సరిపోవడం లేదు. దాంతో రోడ్లు ఎక్కి భిక్షాటన చేస్తున్నాడు. అలా రోజుకు కనీసం రూ.20వేల నుంచి రూ. 30వేలకు వరకు సంపాదిస్తున్నాడు. మళ్లీ దాన్ని ఆ రోజుకే ఖర్చు చేసేస్తాడు. తరువాతి రోజు మళ్లీ ఫ్రెష్‌గా బిచ్చం కోసం రోడ్డు ఎక్కుతాడు. ఇక డోమ్ ప్రవర్తన తెలిసిన బంధువులు, స్నేహితులు అతడ్ని పట్టించుకోవడమే మానేశారు. ఇలా అందరూ ఉండి, కోట్ల ఆస్తి ఉన్నా కూడా తనను ఎవరూ పట్టించుకోకపోవడంతో మనోడికి ఇప్పుడిప్పుడే కాస్తా అసలు విషయం బోధపడినట్టుంది. దాంతో ఇకపై వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కానీ, అది ఎంతవరకు సాధ్యమనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుందని డోమ్ చెప్పుకొచ్చాడు.

Updated Date - 2022-12-03T11:59:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising