Viral Video: భార్య కోసం గాలి పరుపును ఏర్పాటు చేసిన భర్త... చివరకు ఆమెను ఎలా ఆటపట్టించాడో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN, First Publish Date - 2022-07-08T00:29:35+05:30
సోషల్ మీడియాలో కామెడీతో కూడిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వివాహ సమయాల్లో వధూవరులను వారి స్నేహితులు ఆట పట్టించడం, ఇంకొన్ని సార్లు భర్తను భార్య, భార్యను భర్త....
సోషల్ మీడియాలో కామెడీతో కూడిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వివాహ సమయాల్లో వధూవరులను వారి స్నేహితులు ఆట పట్టించడం, ఇంకొన్ని సార్లు భర్తను భార్య, భార్యను భర్త.. ఆట పట్టిస్తుంటారు. కొన్ని వీడియోలు నవ్వు ఆపుకోలేని విధంగా ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. భార్య కోసం ఓ భర్త.. గాలి పరుపును ఏర్పాటు చేశాడు. నా భర్త ఎంత మంచివాడు అనుకుంటూ మహిళ సంబరపడుతుంది. అయితే చివరలో సీన్ చూసి.. నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్యను సరదాగా ఆట పట్టించాలనుకున్నాడు. ఇందుకోసం ఇంట్లో ఉన్న ఎయిర్ బెడ్‌ను పక్కకు తీసేశాడు. దాని స్థానంలో స్మిమ్మింగ్ పూల్ ఆకారంలో ఉన్న ఎయిర్ బ్యాగ్‌ను ఏర్పాటు చేస్తాడు. తర్వాత అందులో నీరు నింపి, అనుమానం రాకుండా దానిపై దుప్పటి కప్పేస్తాడు. కాసేపటికి అతడి భార్య ఫోన్‌లో మాట్లాడుకుంటూ అక్కడికి వస్తుంది. నా భర్త ఎంత మంచి వాడు.. బెడ్‌ను బాగా సర్దిపెట్టాడు.. అని అనుకుంటూ దానిపై పడుకుంటుంది. ఇంకేముందీ.. ఒక్కసారిగా అందులోని నీళ్లలో పడిపోతుంది. అవాక్కైన ఆమె పైకి లేచి.. కంగారుగా అటూ ఇటూ చూస్తుంది. ఈ ఘటనను మొత్తం ఆమె భర్త వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోకు 9మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
పులి బోనులో ఉంది కదా అని.. చక్కిలిగింతలు పెట్టాడు.. ఇంతలో అనుకోని ఘటన.. అయితే టైం బాగుండడంతో..
Updated Date - 2022-07-08T00:29:35+05:30 IST