ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రసగుల్లల కోసం ఏకంగా ఏడు రైళ్లను ఆపేశారు.. పట్టాలపై టెంట్లు వేసి మరీ క్యూ కట్టిన జనాలు..!

ABN, First Publish Date - 2022-05-24T23:20:12+05:30

బీహార్ రాష్ట్రం బర్హియా ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ పట్టాలపై వందలాది మంది స్థానికులు టెంట్లు వేసి మరీ నిరసన తెలియజేశారు. అక్కడే వంటావార్పు నిర్వహించి, భజనలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో హౌరా-ఢిల్లీ రైలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లడ్డూ అనగానే తిరుపతి, కాజా అనగానే కాకినాడ.. ఇలా వస్తువులు, ఆహార పదార్థాల పేరు చెప్పగానే కొన్ని ప్రాంతాలు గుర్తొస్తుంటాయి. అలాగే బీహార్‌లో రసగుల్లా అనగానే స్థానికులకు బర్హియా అనే ప్రాంతం గుర్తుకొస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. రసగుల్లల కోసం ప్రజలు ఏకంగా ఏడు రైళ్లను ఆపేశారు. పట్టాలపై టెంట్లు వేసి మరీ ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే..


బీహార్ రాష్ట్రం బర్హియా ప్రాంతంలోని రైల్వే స్టేషన్‌ పట్టాలపై వందలాది మంది స్థానికులు టెంట్లు వేసి మరీ నిరసన తెలియజేశారు. అక్కడే వంటావార్పు నిర్వహించి, భజనలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో హౌరా-ఢిల్లీ రైలు మార్గంలో 24 గంటల పాటు డజను రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. కొన్ని రైళ్లను దారి మళ్లించాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి చేరుకుని నిసరనకారులతో మాట్లాడారు. స్థానికుల డిమాండ్ల పరిష్కారానికి అంగీకరించడంతో సోమవారం మధ్యాహ్నం నుంచి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. నిరసనకు గల కారణాల్లోకి వెళితే.. బర్హియా ప్రాంతం రసగుల్లాలకు ప్రసిద్ధి. ఇక్కడ 250మంది దుకాణదారులు రసగుల్లాలు తయారు చేస్తుంటారు. ఇక్కడి రసగుల్లాల కోసం ఎక్కడిడెక్కడి నుంచో కస్టమర్లు ఇక్కడికి వస్తుంటారు.

ఈ ఫొటోలోని ఆరేళ్ల పాప ఇప్పుడు బతికిలేదు కానీ అయిదుగురి ప్రాణాలను కాపాడింది.. అసలేం జరిగిందంటే..


అలాగే స్థానికంగా ఉన్న దేవీ మా ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి శని, ఆదివారాల్లో ఇక్కడికి రోజూ పది వేల మంది భక్తులు వస్తుంటారు. మరోవైపు బర్హియా ప్రాంతం నుంచి వందలాది మంది విద్యార్థులు వివిధ ప్రాంతాలకు చదువుకునేందుకు వెళ్తుంటారు. అయితే స్థానికంగా రైళ్లు ఆగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాట్నా నుంచి బర్హియాకు రైళ్లో వెళితే రూ.50మాత్రమే అవుతుంది. అదే బస్సుల్లో వెళితే రూ. 150లు, కార్లు అద్దెకు తీసుకుని వెళితే రూ.4నుంచి రూ.5వేలు అవుతుందని స్థానికులు తెలిపారు. స్థానికంగా రైళ్లు నిలపాలను ఎప్పటి నుంచో కోరుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో నిరసనకు దిగామన్నారు. ఎట్టకేలకు బర్హియా స్టేషన్‌లో రైళ్లను ఆపేందుకు అధికారులు ఒప్పుకోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

చోరీకి గురయిన విగ్రహాలు.. మళ్లీ ఇంట్లో ప్రత్యక్ష్యం.. వాటితోపాటు దొరికిన లేఖలో ఆ దొంగ రాసింది చదివి..

Updated Date - 2022-05-24T23:20:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising