ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మొక్క మీ ఇంట్లో ఉందా.. అయితే ప్రాణాలు జాగ్రత్త..!

ABN, First Publish Date - 2022-07-09T23:49:06+05:30

ఈ మొక్క పేరు చెప్తే చాలు పర్యావరణవేత్తలు హడలిపోతున్నారు. వీటితో పర్యావరణానికి పలు విధాలుగా హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోనోకార్పస్.. ఈ మొక్క పేరు చెప్తే చాలు పర్యావరణవేత్తలు హడలిపోతున్నారు. వీటితో పర్యావరణానికి పలు విధాలుగా హాని కలుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు నిటారుగా, ఏపుగా పెరుగుతుండడంతో వీటిని రోడ్లకు మధ్య డివైడర్ల పైన నాటుతున్నారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.


కోనోకార్పస్‌ పువ్వులోని పుప్పొడి కారణంగా అలర్జీ, శ్వాసకోస, ఆస్తమా సమస్యలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు దేశాలు ఈ మొక్కను నిషేధించాయి. ఈ మొక్కవల్ల పర్యావరణానికి ఎలాంటి ఉపయోగం లేదని గుర్తించారు. పుప్పొడి కారణంగా వీటిపై సీతాకోక చిలుకలు సైతం వాలడం లేదు. అంతేకాక జంతువులు వీటి ఆకులు తినవు. ఈ మొక్క వల్ల ఉపయోగం లేకపోగా.. ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలుగజేస్తోంది.

చేపలు తినేందుకు నిరాకరిస్తున్న Penguins.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..!


కోనోకార్పస్‌ మొక్కలో అనేక ఉపజాతులున్నాయి. ఎక్కువగా మడ అడవుల్లో ఇవి పెరుగుతాయి. వీటినే మాంగ్రూవ్ మొక్కలని కూడా పిలుస్తారు. తీర ప్రాంతాల్లో పెరగడం వల్ల నీటి ప్రవాహాన్ని తట్టుకునేందుకు వీలుగా వీటి వేర్లు బురద నేలల్లోకి అనేక మీటర్ల లోతుకు వెళ్లి స్థిరపడతాయి. తక్కువ కాలంలో ఏపుగా పెరగడం, వేర్లు లోతుకు పాతుకుపోవడంతో ఇది ప్రతీ రుతువులోనూ పచ్చదనంతో కళకళలాడుతుంది.

INDIAN RAILWAY: 10 నెలల చిన్నారికి రైల్వే ఉద్యోగం..!


రోడ్లకు ఇరువైపులా, మధ్యలో నాటడం వల్ల పరిసరాలు పచ్చదనంతో నిండిపోతున్నాయి. వారాల వ్యవధిలో మొక్కలు ఏపుగా పెరుగుతుండటంతో వీటిని తెలంగాణలోనూ అనేక మున్సిపాలిటీల్లో నాటారు. దీని దుష్పరిణామాలను గుర్తించిన ప్రభుత్వం.. ఈ మొక్కలను హరితహారంలో నాటొద్దని, నర్సరీల్లో పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Viral Video: ఇలాక్కూడా ఇస్త్రీ చేస్తారా.. ఇతను బట్టలను Iron చేసే విధానం చూస్తే.. వామ్మో! అని అంటారు..



Updated Date - 2022-07-09T23:49:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising