ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Children`s Day: బాలల దినోత్సవం సందర్భంగా క్యూట్ వీడియో షేర్ చేసిన IFS అధికారి.. ఈ వీడియో ఎన్ని హృదయాల్ని గెలుచుకుందో..

ABN, First Publish Date - 2022-11-14T18:23:29+05:30

ఈ రోజు (సోమవారం) బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వాటిలో ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా షేర్ చేసిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లలను ఎంతగానో ఇష్టపడే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ రోజు (సోమవారం) బాలల దినోత్సవం సందర్భంగా ఎంతో మంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వాటిలో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్) అధికారి సుశాంత నందా షేర్ చేసిన వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఐదు కోడి పిల్లలు, ఓ కోతి పిల్ల ఆడకుంటున్నాయి. ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఎంతో సంతోషంగా, కలిసి మెలిసి ఆడుకుంటున్నాయి. ఆ వీడియో చాలా అందంగా, స్వచ్ఛంగా ఉంది. ఆ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద.. ప్రపంచంలో అత్యంత విలువైనది పిల్లల ముఖంలో చిరునవ్వు. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు` అని కామెంట్ చేశారు. ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

Updated Date - 2022-11-14T18:29:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising