ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీడు మామూలోడు కాదు.. పరీక్షల్లో ఇతడు కాపీ కొట్టిన విధానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..

ABN, First Publish Date - 2022-04-07T17:56:45+05:30

కొందరు విద్యార్థులు చదువు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరైతే పాఠశాలకు వెళ్లాలంటేనే బద్ధకిస్తుంటారు. ఒక వేళ వెళ్లినా మనసు ఓచోట, శరీరం మరోచోట...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు విద్యార్థులు చదువు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. మరికొందరైతే పాఠశాలకు వెళ్లాలంటేనే బద్ధకిస్తుంటారు. ఒక వేళ వెళ్లినా మనసు ఓచోట, శరీరం మరోచోట అన్నట్లుగా ఉంటారు. పరీక్షలు దగ్గర పడేవరకూ పుస్తకాలు ముట్టరు. చివరకు పరీక్షల్లో ఎలాగైనా పాసవ్వాలనే ఉద్దేశంతో కాపీలు కొట్టి దొరికిపోతుంటారు. ఇంకొందరు విద్యార్థుల తెలివితేటలు చూస్తే.. ఆశ్యర్యం వేస్తుంది. వినూత్నంగా ఆలోచించి మరీ పరీక్షల్లో కాపీ కొడుతుంటారు. హర్యానాలో ఓ విద్యార్థి ఇలాగే.. పరీక్షల్లో కాపీ కొట్టేందుకు తన తెలివితేటలకు పదును పెట్టాడు. అతడు కాపీ కొట్టిన విధానం చూసి.. అధికారులు అవాక్కయ్యారు.


హర్యానా రాష్ట్రంలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఫతేహాబాద్‌లోని పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి కాపీ కొట్టిన విధానం అంతా అవాక్కయ్యేలా చేసింది. గ్లాసు క్లిప్ బోర్డుతో పరీక్ష కేంద్రానికి హాజరయ్యాడు. ఇంతవరకు బాగున్నా.. ఇక్కడే అసలైన ట్విస్టు చోటు చేసుకుంది. మామూలు క్లిప్ బోర్డుతో హాజరై ఉండుంటే.. ఎలాంటి సమస్యా ఉండేది కాదు. కానీ ఇతడు మాత్రం గ్లాసు బోర్డులో మొబైల్‌ని అమర్చుకుని మరీ హాజరయ్యాడు.

ముగ్గురు విద్యార్థులను ఇంటికి పిలిచిన టీచర్.. ప్రియుడిని వీడియో తీయమంటూ ఆమె చేసిన పని..


అందులో వాట్సాప్ తదితర యాప్‌లలో స్లిప్పులను సేవ్ చేసి పెట్టుకున్నాడు. పరీక్ష ప్రారంభం కాగానే ఎంచక్కా.. అందులో చూసి రాయడం మొదలెట్టాడు. అయితే  ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. విషయం బయటపడింది.  దీంతో విద్యార్థిని పరీక్ష హాలు నుంచి బయటికి పంపించారు. ఇదే రోజు సుమారు 457మంది విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడినట్లు తెలిసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

పరాయి మహిళతో పారిపోయేందుకు సిద్ధపడ్డాడు.. అర్ధరాత్రి ఆమెను తీసుకెళ్తుండగా దారి మధ్యలో..





Updated Date - 2022-04-07T17:56:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising