ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య దూసుకొచ్చిన భారీ ఇనుప బంతులు.. తీరా ఏంటా అని పరిశీలించగా..

ABN, First Publish Date - 2022-05-15T18:36:25+05:30

ఆకాశం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడా జరుగుతూ ఉండడం చూస్తేనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసుల గురించి చర్చ నడుస్తుంటుంది. ప్రస్తుతం గుజరాత్‌లో ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకాశం నుంచి వస్తువులు కింద పడటం తరచూ అక్కడక్కడా జరుగుతూ ఉండడం చూస్తేనే ఉంటాం. ఇలాంటి సందర్భాల్లో గ్రహాంతరవాసుల గురించి చర్చ నడుస్తుంటుంది. ప్రస్తుతం గుజరాత్‌లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వేకువజామున ఆకాశంలో ఉరుములు, మెరుపుల మధ్య బంతుల్లాంటి ఆకారంలో ఉన్న భారీ గోళాలు భూమిపైకి దూసుకొచ్చాయి. వాటిని చూసి రైతులు భయాందోళన చెందారు. తీరా సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.


గుజరాత్ రాష్ట్రం ఆనంద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని మూడు గ్రామాల్లో గురువారం భారీ గోళాలు భూమిపై పడ్డాయి. అలాగే  ఖేడా జిల్లా పరిధిలో శుక్రవారం వేకువజామున బుల్లెట్ల ఆకారంలో ఉన్న వస్తువులు నేలపై పడిపోయాయి. అయితే పొలాల్లో పడడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. గమనించిన స్థానికులు భయాందోళన చెంది.. పోలీసులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. శాటిలైట్‌కు సంబంధించిన వస్తువులుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలించారు.

ఒకే ఒక్క పొటాటో చిప్ పీస్ ధర ఏకంగా రూ.1.63 లక్షలు.. ఇంత ఖరీదేంటని ఆశ్చర్యపోతున్నారా..?


గుజరాత్‌లో నాలుగు రోజులుగా అంతరిక్షం నుంచి పెద్ద ఇనుప బంతులు పడుతున్నాయి. బుధవారం రాత్రి నదియాడ్ తాలూకా భూమేల్ గ్రామంలోని పౌల్ట్రీ ఫారం సమీపంలో మొదటిసారిగా బుల్లెట్ ఆకారంలో ఉన్న వస్తువు పడింది. తర్వాత షీలీ, ఖాన్కువాన్ గ్రామ పొలాల్లో రెండు ఇనుప గుండ్లు పడినట్లు స్థానికులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. పొలాల్లోకి పనులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

రాత్రి వేళ ప్రజలు ఉగాది వేడుకల్లో ఉండగా.. ఆకాశంలో ఒక్కసారిగా మెరుపులు.. ఉన్నట్టుండి భూమిపై పడిన వస్తువులు చూసి..

Updated Date - 2022-05-15T18:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising