Veera Simha Reddy: ‘జై బాలయ్య’ మాస్ యాంథమ్.. తిప్పు సామీ కోర మీసమ్

ABN, First Publish Date - 2022-11-25T11:36:59+05:30

పవర్ ఫుల్ లిరిక్స్‌‌, మ్యూజిక్‌తో సాగిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry), ఎస్. థమన్ (S Thaman) మరోసారి ప్రాణం పెట్టేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా. ఈ పాటని

Veera Simha Reddy: ‘జై బాలయ్య’ మాస్ యాంథమ్.. తిప్పు సామీ కోర మీసమ్
Balakrishna in Veera Simha Reddy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) పతాకంపై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి(Sankranthi)కి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమౌతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌‌లో జరుగుతోంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టడమే కాకుండా.. తాజాగా ‘జై బాలయ్య’ (Jai Balayya) అనే ఫస్ట్ సింగిల్‌ని కూడా మేకర్స్ వదిలారు. ఈ సాంగ్‌కి సంబంధించి వివరాలు తెలిపేందుకు విడుదల చేసిన లుక్స్‌లో బాలయ్య రాయల్‌గా కనిపించి.. పాటపై, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు విడుదలైన లిరికల్ సాంగ్ కూడా అంతకు మించి అనేలా ఉంది.

‘‘రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి తీరు

నిన్ను తలుచుకున్నవారు.. లేచి నుంచొని మొక్కుతారు

అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా..

అల నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా..

మా తెల్లవారే పొద్దు నువ్వయ్యా.. మా మంచీ చెడ్డల్లొన జత కట్టినావయ్యా..

జన్మ బంధువంటూ నీకు జై కొట్టినమయ్యా..

జై బాలయ్య.. జై బాలయ్య.. జై జై బాలయ్యా.. జై బాలయ్య

జై బాలయ్య.. జై బాలయ్య.. మా అండ దండ నువ్వుంటే అంతే చాలయ్యా

హే తిప్పు సామీ కోర మీసమ్.. తిప్పు సామీ ఊరి కోసమ్..

నమ్ముకున్న వారి కోసమ్.. అగ్గిమంటై నీ ఆవేశమ్

నిన్ను తాకే దమ్మున్నోడు.. లేనే లేడయ్యా..’’ అంటూ పవర్ ఫుల్ లిరిక్స్‌‌, మ్యూజిక్‌తో సాగిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry), ఎస్. థమన్ (S Thaman) మరోసారి ప్రాణం పెట్టేశారు. నందమూరి అభిమానులకు ఇది మరో బొనాంజా. ఈ పాటని కరిముల్లా పాడిన తీరు కూడా ఆకట్టుకుంటోంది. సంక్రాంతి సంబరం అంతా ఈ పాటలోనే ఉందీ అన్నట్లుగా.. పాటని పిక్చరైజ్ చేస్తున్న తీరు కూడా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణని అభిమానులు నినదించే ‘జై బాలయ్య’ అనే పదంతో రెండో సారి థమన్ చేసిన ఈ పాటతో ఆ నినాదం ఇక ఓ మంత్రంగా మారిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. మొత్తంగా.. ఈ పాటతో సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. (Jai Balayya Song From Veera Simha Reddy Out)

Updated Date - 2022-11-25T13:09:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising