చుట్టూ అందమైన సీతాకోక చిలుకలు... మధ్యలో ఎంజాయ్ చేస్తున్న మీరు... బిస్లే ఘాట్‌కు వెళితే కనిపించేది ఇదే...
ABN, First Publish Date - 2022-11-21T10:14:00+05:30
ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అందమైన బీచ్‌లు కలిగిన ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. పర్వతాల మీద చల్లదనాన్ని, సహజత్వాన్ని చూడాలనుకుంటారు.
ప్రకృతి ప్రేమికులు పర్వతాలు, అందమైన బీచ్‌లు కలిగిన ప్రదేశానికి వెళ్లాలని ప్లాన్ చేస్తారు. పర్వతాల మీద చల్లదనాన్ని, సహజత్వాన్ని చూడాలనుకుంటారు. బీచ్‌లో విశ్రాంతిని, ఆనందాన్ని పొందవచ్చు. మైదానాలలోనూ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉంటాయి. ఇక్కడికి వెళ్లడానికి కూడా చాలామంది ఇష్టపడుతుంటారు. మైదానాల్లో సహజత్వం, ప్రశాంతతో కూడిన ఆహ్లాదాన్ని ఆస్వాదించాలనుకుంటే అడవిని సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు. మన దేశంలో అందమైన సీతాకోకచిలుకలు కలిగిన అడవి కూడా ఉంది, ఇక్కడ వేలాది రకాల సీతాకోకచిలుకలు మీ కళ్ళ ముందు కదలాడుతాయి. ఇంతేకాకుండా పక్షుల కిలకిలారావాలు, పచ్చదనం మధ్య సమయం గడపవచ్చు.
భారతదేశంలోని అత్యంత అందమైన సీతాకోకచిలుకల అడవి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బటర్‌ఫ్లై ఫారెస్ట్ దక్షిణ భారతదేశంలోని కర్ణాటకలో ఉంది. కర్ణాటకలోని కొడగు, మల్నాడు, దక్షిణ కన్నడలో దట్టమైన అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవిని సందర్శించడానికి వచ్చేవారు రోజంతా ఇక్కడ గడిపి, సాయంత్రం ఈ ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకుంటారు. కర్ణాటకలోని సీతాకోకచిలుకల అడవి పేరు 'బిస్లే ఘాట్'. పశ్చిమ కర్ణాటకలో విస్తరించి ఉన్న బిస్లే ఘాట్ అడవుల ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ వేలాది రకాల సీతాకోక చిలుకలు కనిపిస్తాయి.
ఈ దట్టమైన అడవిలో వర్షాకాలంలో వలస సీతాకోకచిలుకలు కనిపిస్తాయి. కామన్ కాస్టర్, కామన్ గ్లాస్ ఎల్లో, కామన్ జే, ప్లెయిన్ టైగర్, స్పాటెడ్ పారెట్, లైన్ బ్లూ, బాల్కా పారోట్, డింగీ స్విఫ్ట్ మొదలైన వివిధ రకాల సీతాకోకచిలుకలు ఈ అడవిలో కనిపిస్తారు. అంతే కాకుండా వేలాది రకాల పక్షులను కూడా ఈ అడవిలో కనిపిస్తాయి. ఒక నది అడవిలోని వృక్షసంపద, పచ్చదనం గుండా వెళుతుంది. బిస్లే ఘాట్ బటర్‌ఫ్లై జంగిల్‌లో అనేక వినోద కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు. బైక్ లేదా కారులో అడవిలో ప్రయాణించవచ్చు. ఇక్కడ ట్రెక్కింగ్‌ని కూడా ఆస్వాదించవచ్చు.
ఈ అడవిలో అనేక వ్యూ పాయింట్లు కూడా ఉన్నాయి. బిస్లే ఘాట్‌కు సెలవులలో ఎంజాయ్ చేసేందుకు వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. బిస్లే ఘాట్ సందర్శించడానికి వర్షాకాలం ఉత్తమ సమయం. వర్షాకాలంలో ఈ లోయలో సీతాకోక చిలుకలే కాకుండా వలస పక్షులను కూడా చూడవచ్చు. కర్నాటకలోని హసన్ జిల్లాలోని సకలేష్‌పూర్ ప్రాంతంలో బిస్లే ఘాట్ అడవి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి సకలేష్‌పూర్‌కు బస్సు లేదా రైలులో చేరుకోవాలి. సకలేష్‌పూర్ నుండి బిస్లే ఘాట్‌కు స్థానిక టాక్సీలు, స్థానిక బస్సులు కూడా నడుస్తాయి. బెంగుళూరు నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిస్లే ఘాట్‌కి నేరుగా ప్రయాణం చేయవచ్చు.
Updated Date - 2022-11-21T10:16:14+05:30 IST