ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Krishna-Sivaji Ganesan: శివాజీ గణేశన్‌తో మూడు...

ABN, First Publish Date - 2022-11-15T08:11:55+05:30

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటే సీనియర్స్‌ ఎన్టీఆర్‌, ఏయన్నార్‌తో కలసి నటించడమే కాకుండా తమిళ చిత్ర రంగంలో నడిగర్‌ తిలకంగా పేరొందిన శివాజీ గణేశన్‌తో కూడా నటించే అవకాశం సూపర్‌స్టార్‌ కృష్ణకు లభించింది. తమిళంలో శివాజీ నటించిన సినిమాలు తెలుగులో చేసి పేరు తెచ్చుకున్న కృష్ణ ఆయనతో కలిసి మూడు చిత్రాల్లో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటే సీనియర్స్‌ ఎన్టీఆర్‌(Ntr), ఏయన్నార్‌(ANR)తో కలసి నటించడమే కాకుండా తమిళ చిత్ర రంగంలో నడిగర్‌ తిలకంగా పేరొందిన శివాజీ గణేశన్‌తో (Sivaji ganeshan)కూడా నటించే అవకాశం సూపర్‌స్టార్‌ కృష్ణకు లభించింది. తమిళంలో శివాజీ నటించిన సినిమాలు తెలుగులో చేసి పేరు తెచ్చుకున్న కృష్ణ (Krishna passed awayఆయనతో కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో తొలి సినిమా ‘నివురుగప్పిన నిప్పు’. ఇందులో శివాజీ మేనమామగా, కృష్ణ మేనల్లుడిగా నటించారు. శివాజీ కొడుకుగా గిరిబాబు నటించారు. సినిమా టైటిల్‌ ఆయన పరంగా ఉంటుంది. జయప్రద హీరోయిన్‌ గా నటించిన ఈ చిత్రానికి బాపయ్య దర్శకుడు. శివాజీ, కృష్ణ చాలా సన్నివేశాల్లో పోటీ పడి నటించినా, కొన్ని చోట్ల శివాజీ డామినేషన్‌తో కృష్ణ నటన తేలిపోయిందని ఒప్పుకు తీరాలి. ‘నివురుగప్పిన నిప్పు చిత్రానికి  భమిడిపాటి రాధాకృష్ణ సంభాషణలు రాసినా, పతాక సన్నివేశాలను మాత్రం పరుచూరి గోపాలకృష్ణ రాశారు. హీరో కృష్ణ సినిమాలకు ఆయన ఘోస్ట్‌ రైటర్‌గా పని చేసిన రెండో చిత్రం ఇది. 1982 జూన్‌ 24న ఈ చిత్రం విడుదలైంది. శివాజీ గణేశన్‌, కృష్ణ కలసి నటించిన రెండో చిత్రం ‘బెజవాడ బెబ్బులి’. ఇందులో తండ్రీ కొడుకులుగా శివాజీ డ్యూయల్‌ రోల్‌ చేయడం విశేషం అయితే, ఆయన, కృష్ణ అన్నదమ్ములుగా నటించడం మరో విశేషం. మహా నటుడైన శివాజీతో ఢీ అంటే ఢీ అనే పాత్రను కృష్ణ పోషించారు. విజయ నిర్మల ఈ చిత్రానికి దర్శకురాలు. సమయపాలనలో శివాజీ కచ్చితంగా ఉండేవారు. ఇక హీరో కృష్ణ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనది టైమ్‌ అంటే టైమే. ఈ సినిమా కోసం శివాజీ 30 కాల్షీట్స్‌ ఇేస్త ఆయన ద్విపాత్రాభినయం చేయడానికి 23 రోజుల్లోనే పూర్తి చేసి శివాజీ ప్రశంసలు అందుకున్నారు విజయ నిర్మల. శివాజీ గణేశన్‌, కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం విశ్వనాథ నాయకుడు. ఈ చారిత్రక చిత్రంలో నాగమ నాయకుడిగా శివాజీ, ఆయన కొడుకు విశ్వనాథ నాయకుడుగా కృష్ణ నటించారు. కృష్ణదేవ రాయలుగా కృష్ణంరాజు నటించడం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ నర్తకిగా జయప్రద, పట్టపు రాణిగా సుమలత, కృష్ణ తల్లిగా కే.ఆర్‌. విజయ నటించారు. ఇది సూపర్‌స్టార్‌ కృష్ణకు 250వ చిత్రం కావడం విశేషం. అలాగే శివాజీ గణేశన్‌ హీరోగా తమిళంలో రెండు చిత్రాలు నిర్మించారు కృష్ణ. తెలుగులో కృష్ణంరాజు నటించిన ‘శివ మెత్తిన సత్యం’ చిత్రాన్ని శివాజీ హీరోగా తమిళంలో ‘విశ్వరూపం’ పేరుతో నిర్మించారు. అలాగే కన్నడంలో హిట్‌ అయిన సినిమాను ‘త్యాగి’ పేరుతో తమిళంలో నిర్మించారు కృష్ణ. శివాజీ గణేశన్‌ నటించిన ఈ చిత్రం 1982 లో విడుదలైంది. 

Updated Date - 2022-11-15T08:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising