Kriti Sanon: ‘అందగాడు.. పొడుగైన వాడు భర్తగా కావాలి’
ABN, First Publish Date - 2022-12-11T13:01:28+05:30
కృతి సనన్ (Kriti Sanon).. తెలుగులో అంతగా నెగ్గుకు రాలేకపోయింది. ఆమెను అంతా మర్చిపోతున్న తరుణంలో ‘ఆదిపురుష్’ (Adipurush) ఆఫర్ అందుకొంది.
కృతి సనన్ (Kriti Sanon).. తెలుగులో అంతగా నెగ్గుకు రాలేకపోయింది. ఆమెను అంతా మర్చిపోతున్న తరుణంలో ‘ఆదిపురుష్’ (Adipurush) ఆఫర్ అందుకొంది. పాన్ ఇండియా సినిమా.. అందులోనూ ప్రభాస్‌తో. కృతి మళ్లీ రేసులోకి వచ్చినట్టైంది. దానికి తోడు ప్రభాస్ (Prabhas)తో డేటింగ్ చేస్తోందన్న విషయంలో పాపులర్ అయింది. టాలీవుడ్ (Tollywood)లో మళ్లీ బిజీ అవ్వాలని కలలు కంటున్న కృతి చెప్పుకొచ్చిన ముచ్చట్లు ఇవీ...!
మిస్టర్ కూల్.. మహేశ్..
‘‘నా తొలి సినిమానే మహేశ్‌బాబు లాంటి స్టార్‌తో చేయడం అదృష్టం. నిజానికి అప్పట్లో నాకు మహేశ్ గురించి గానీ, తెలుగు సినిమాల గురించి గానీ పెద్దగా తెలీదు. అది ఒకందుకు ప్లస్ అయ్యింది. మహేశ్ ఇచ్చిన కంఫర్ట్ మరో నటుడు ఇవ్వలేడు. ఆయన్ని సింపుల్‌గా ‘మిస్టర్ కూల్’ అనొచ్చు. చిన్నపిల్లల్ని చూస్తే మాత్రం మొహం మీద చక్కని చిరునవ్వు వచ్చేసేది. నాకు అప్పట్లో తెలుగు అస్సలు రాదు. ‘తెలుగు రాని నాకు ఇన్ని డైలాగులు ఎందుకు’ అని సుకుమార్ సార్ దగ్గర అలిగేదాన్ని. ఆయన నవ్వుతూ నాకు తెలుగు పదాలకు అర్థాన్ని విడమరచి చెప్పేవారు.’’
థాంక్యూ ప్రభాస్..
‘‘ఇప్పుడు నా తెలుగు కాస్త మెరుగుపడింది. దానికి కారణం ప్రభాస్. ఈ విషయంలో ఆయనకు థాంక్స్ చెప్పుకోవాలి. ‘ఆదిపురుష్’ సెట్లో ఆయన నాకు తెలుగు నేర్పారు. బదులుగా నేను నాకొచ్చిన హిందీ ఆయనకు నేర్పాను. ‘ఆదిపురుష్’ మొదలైన కొత్తలో ఆయనకు హిందీ అంతగా వచ్చేది కాదు. ‘నాకు హిందీ రాదు... నువ్వే సర్దుకుపోవాలి’ అన్నారు. ఇప్పుడు మాత్రం ధారాళంగా మాట్లాడుతున్నారు. మా ఇద్దరి మధ్యా ఏదో ఉందని బాలీవుడ్ అంతా మాట్లాడుకుంటోంది. నిజానికి ప్రభాస్ మంచి కో స్టార్ అంతే. సెట్లో అందరితోనూ స్నేహంగా ఉంటారు. ఆ మాత్రం దానికే ప్రేమ - పెళ్లి అంటూ రాయడం సరికాదు.’’
నా హైట్ ప్లస్..!
‘‘కెరీర్ మొదలైన కొత్తలో ‘ఇంత పొడుగున్నావేంటి?’ అని అంతా ఆట పట్టించేవారు. ‘నీ హైట్ నీకు మైనస్’ అనేవారు. నాకూ కొంత భయం వేసేది. ఎందుకంటే చిత్రసీమలో హైట్ ఉన్న హీరోల సంఖ్య చాలా తక్కువ. కానీ ఎత్తు అనేది సమస్యే కాదని తేలిపోయింది. పైగా నాకు అది చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. మహేష్, ప్రభాస్ లాంటి హీరోల సరసన నాకు అవకాశం వచ్చిందంటే కారణం నా ఎత్తే. నాలోనూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. వాటిని అధిగమించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్నాను.’’
అందగాడు కావాలి..
‘‘చిన్నప్పుడు, ప్రేమంటే తెలియని వయసులో క్రష్‌లు ఉండడం సహజమే. నేను కూడా రెండు మూడు సార్లు ఆ అనుభూతిలో విహరించాను. కానీ అప్పట్లో నేను భయస్తురాల్ని. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు. నేను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర కూడా నోరు మెదపలేకపోయాను. కాకపోతే ఆ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తే. కాబోయే వాడు ఎలా ఉండాలనేదానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబోయే భర్త నాకంటే పొడవు ఉండాలి. అందగాడు కావాలి. మంచి మాటకారై ఉండాలి. తనతో ఎప్పటికీ నాకు బోర్ కొట్టకూడదు.’’
డాన్స్ అంటే ఇష్టం..
‘‘చిన్నప్పటి నుంచీ నాకు డాన్స్ అంటే ఇష్టం. మా అమ్మ కథక్ నేర్చుకోమని పోరు పెట్టేది. నాకేమో క్లాసికల్ డాన్స్ పెద్దగా రాదు. పైగా స్కూల్ నుంచి అలసిపోయి ఇంటికొస్తే డాన్స్ కోసం మరో గంట కేటాయించాలి. అందుకే చాలాకాలం కథక్ జోలికి వెళ్లలేదు. కానీ అమ్మ పోరు పడలేక కథక్ నేర్చుకొన్నా. అది నాకు బాగా ప్లస్ అయ్యింది. సినిమాల్లో కథక్ ప్రదర్శించే అవకాశం రాలేదు కానీ డాన్స్‌లో బేసిక్స్ తెలియాలంటే, సినిమాటిక్ మూమెంట్స్ ఈజీగా చేయాలంటే ఏదో ఓ క్లాసికల్ డాన్స్ తప్పకుండా వచ్చి ఉండాలన్న విషయం అర్థమైంది.
Updated Date - 2022-12-11T13:26:43+05:30 IST