తలుపులు వేసిన ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించిన స్థానికులు.. టెర్రస్ పైకి వెళ్లి పరిశీలించగా షాకింగ్ సీన్..
ABN, First Publish Date - 2022-09-21T22:17:50+05:30
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు ఆన్‌లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతుంటే... మరికొందరు ఇళ్లల్లోకి చొరబడి మరీ..
సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా మంది వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు ఆన్‌లైన్ వేదికగా మోసాలకు పాల్పడుతుంటే... మరికొందరు ఇళ్లల్లోకి చొరబడి మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. చివరకు జైల్లో ఉచలు లెక్కెడుతుంటారు. రాజస్థాన్‌లో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తలుపులు వేసి ఉన్న ఇంట్లో వెలుతురు రావడాన్ని స్థానికులు గమనించారు. తీరా దగ్గరికి వెళ్లి పరిశీలించి షాక్ అయ్యారు. బయట తలుపులు మూసి, పోలీసులకు ఫోన్ చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) బౌన్లీ పరిధి చౌదరి మొహల్లా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పదమ్ జైన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జైపూర్‌లో ఉంటున్నాడు. దీంతో మొహల్లాలో ఉన్న తన ఇంటికి తాళం వేసి ఉంది. వీరి ఇంటి పక్కనే పదమ్ జైన్ బంధువైన అతుల్ జైన్ అనే వ్యక్తి ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల ఓ రోజు వేకువజామునే బహిర్భూమికి వెళ్లిన అతుల్ జైన్.. తన మామ పదమ్ జైన్ ఇంటి నుంచి వెలుతురు రావడాన్ని గమనించాడు. ఇంట్లో ఎవరూ లేకున్నా వెలుతురు రావడంతో అనుమానం కలిగింది.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో ఫొటోలు పంపిన యువతి.. మరుసటి రోజు తన వాట్సప్‌కు వచ్చిన వీడియో చూసి షాక్..
వెంటనే తన మామకు సమాచారం అందించడంతో పాటూ స్థానికులతో కలిసి అక్కడికి వెళ్లాడు. టెర్రస్ పైకి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లో చోరీకి పాల్పడుతున్న దొంగలను గుర్తించారు. దీంతో ఇంటి బయట తలుపులు లాక్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. తలుపులు తీసి లోపలికి వెళ్లారు. ఇంట్లోని అల్మారాలు తదితర ప్రదేశాల్లో దాక్కుని ఉన్న దొంగలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని పదమ్ జైన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఇలాంటి చోరీలు పెరిగిపోయాయని, పోలీసులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నిర్మానుష్య ప్రదేశంలో దుస్తులు లేకుండా పడి ఉన్న బాలిక.. మాట్లాడలేని స్థితిలోనూ హావభావాల ద్వారా ఆమె చెప్పింది విని..
Updated Date - 2022-09-21T22:17:50+05:30 IST