వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ చివరకు ఒకే ఒక్క కారణంతో..
ABN, First Publish Date - 2022-06-18T23:20:19+05:30
ప్రేమికులు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. కొందరికి కులమతాలు అడ్డు వస్తే.. మరికొందరి విషయంలో ఆర్థికపరమైన విషయాల కారణంగా పెళ్లికి...
ప్రేమికులు పెళ్లి వరకూ వెళ్లే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటాయి. కొందరికి కులమతాలు అడ్డు వస్తే.. మరికొందరి విషయంలో ఆర్థికపరమైన విషయాల కారణంగా పెళ్లికి పెద్దలు వ్యతిరేకిస్తుంటారు. అయినా కొందరు ప్రేమికులు మాత్రం అవేవీ పట్టించుకోకుండా, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి పీటల వరకూ వెళ్తుంటారు. అయితే కర్నాటకలో ఓ ప్రేమజంట విషయంలో మాత్రం విచిత్ర ఘటన చోటు చేసుకుంది. వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఒకే ఒక్క కారణంతో చివరకు వారి ప్రేమ విషాదాంతమైంది. వివరాల్లోకి వెళితే..
కర్నాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా బెళగావికి చెందిన ప్రవీణ్, భద్రావతి ప్రాంతానికి చెందిన సుధ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుధ తీర్థహళ్లి పోలీస్ స్టేషన్‌లో మహిళా కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా.. ప్రవీణ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ ఇటీవల పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ జోతిష్యుడికి తమ జాతకాల్ని చూపించారు. అయితే సుధ జాతకంలో కుజ దోషం ఉండడంతో వారి పెళ్లికి.. ప్రవీణ్ తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు.
భార్యకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. ఇంటికి వెళ్లాక అనుమానంతో రహస్యంగా ఆమె వాట్సప్ చాటింగ్‌ను చూసిన భర్తకు..
ఇద్దరూ మే 31న గ్రామ పరిసరాల్లోకి వెళ్లి విషం తాగారు. గమనించిన స్థానికులు వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుధ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మంగళూరుకు రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు శుక్రవారం మృతి చెందింది. ప్రవీణ్ మాత్రం ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇదిలావుండగా, ప్రవీణ్ కావాలనే విషం తాగినట్లు నటించాడని పలువురు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అవును.. 19 ఏళ్ల నా కూతుర్ని నేనే చంపేశా.. కానీ ఆమె మేలు కోరే చేశానంటూ.. ఓ తల్లి వింత వాదన వెనుక కథేంటంటే..
Updated Date - 2022-06-18T23:20:19+05:30 IST