Super Star krishna Movies ఎందుకు రీమేక్ చేయడం లేదని మహేశ్‌బాబును అడిగితే..

ABN, First Publish Date - 2022-11-15T14:54:22+05:30

సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే..

Super Star krishna Movies ఎందుకు రీమేక్ చేయడం లేదని మహేశ్‌బాబును అడిగితే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీరంగంలో వారసులకి కొదవలేదు. కాబట్టి వెనకటి పాటలు రీమిక్స్ చేయడం, లేదా ఏకంగా సినిమాలు రీమేక్ చేయడం కూడా తరచూ జరుగుతుంటాయి కూడా. అందుకే మహేష్ బాబు వచ్చిన కొత్తల్లో ‘టక్కరిదొంగ (2002)’ అని సినిమా ఎనౌన్స్ చేయగానే సూపర్ స్టార్ కృష్ణ ‘టక్కరిదొంగ చక్కనిచుక్క (1969)’ రీమేక్ తీస్తున్నారని ఊహాగానాలు చేశారు. దర్శకుడు జయంత్ సి పరాన్జీని కాదని ఎంత చెప్పినా, టక్కరిదొంగ విడుదలయ్యాక గానీ రీమేకింగ్ గురించి కథనాలు ఆగలేదు.

2006లో విడుదలైన ‘పోకిరి’ సినిమాలో హీరో కృష్ణ పాట – ‘గల గల పారుతున్న గోదారిలా…’- పల్లవితో కొత్తపాటని రీమిక్స్ చేయించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పుడు కూడా, సంచలన విజయాలు సాధించిన సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్ని మహేష్ బాబు రీమేక్ చేస్తాడు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. కానీ, మహేష్ వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూనే ఉన్నారు.ఎందుకు రీమేక్స్ మీద ఇష్టం లేదు? కృష్ణ సినిమాలు కాలం చెల్లినవని మహేష్ అభిప్రాయమా? కాదు. అవి కాలాతీతంగా నిలబడ్డాయని ఆయన ఉద్దేశమట.

"కొడుకుగా ఆయన సినిమాలన్నింటినీ ఇష్టపడతాను. సూపర్ స్టార్ కృష్ణ గారి డైహార్డ్ ఫ్యాన్ గా ఇష్టపడేవి మాత్రం - ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్నిపర్వతం’. అవి నా ఆల్ టైమ్ ఫేవరెట్స్." అంటారు మహేష్. అంతగా ఇష్టపడతాను కాబట్టే ‘అల్లూరి సీతారామరాజు’, ‘అగ్నిపర్వతం’సినిమాల రీమేక్ గురించి ఆలోచన కూడా చేయనంటాడాయన. "అలాంటివి మళ్లీ తీయడం, వాటికి న్యాయం చేయడం మరిక ఎవరివల్లా సాధ్యం కాదు. అటువంటి సినిమాలు తీయడం కాదు, తీసి పాడుచేయకపోవడమే సూపర్ స్టార్ పట్ల గౌరవానికి గుర్తు…” అంటారు మహేశ్ నిక్కచ్చిగా.

Updated Date - 2022-11-15T15:29:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising