ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Elon Musk: మరో విచిత్రమైన పని చేసిన మస్క్.. ఇలాంటిది ఎక్కడా చూసుండరు..

ABN, First Publish Date - 2022-11-27T20:29:32+05:30

ఎలాన్ మస్క్‌ చేసిన మరో విచిత్రమైన పని ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అబద్ధాలు చెప్పిన ఓ వ్యక్తికి ఆయన తాజాగా ఉద్యోగం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: టెస్లా, స్పేస్ఎక్స్, ట్విటర్‌ల అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) రూటే సపరేటు. ఆయన తీరును అర్థం చేసుకోవడం దాదాపు అసాధ్యం. ఎప్పుడు ఏం చేస్తారో ఓ పట్టాన అర్థంకాదు. తాజాగా ఆయన తనపై ప్రాంక్ ప్లే చేసిన ఓ వ్యక్తిని పనిలోపెట్టుకున్నారు. ట్విటర్‌లో ఉద్యోగం ఇచ్చారు. ఎవరతను అంటారా.. అతడే..డానియల్ ఫ్రాన్సిస్(Daniel Francis). ట్విటర్‌లో తొలిసారి ఉద్యోగుల తొలగింపులు జరిగినప్పుడు అతడి పేరు మారుమోగిపోయింది.

డానియన్ ఫ్రాన్సిస్..రాహుల్ లిగ్మా(Rahul Ligma) అనే మరో వ్యక్తితో కలిసి..తమను ట్విటర్‌ నుంచి తొలగించారంటూ ప్లకార్డులు ప్రదర్శించాడు. సంస్థ కార్యాలయం నుంచి ఆ ఇద్దరు ప్లకార్డులు పట్టుకుని నడుచుకుంటూ బయటకు వస్తుండగా తీసిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. కొన్ని రోజుల తరువాత వాస్తవం ఏంటో బయటపడింది. వారిద్దరూ అసలు ట్విటర్ ఉద్యోగులే కారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ట్విటర్‌ ఉద్యోగుల తొలగింపు అంశం కలకలం రేపుతున్న సమయంలో వారిద్దరూ సందట్లో సడేమీడియాల్లాగా ఓ ప్రాంక్‌కు యత్నించారని తేలింది.

ఇలాంటి వాళ్లను చూస్తే సంస్థల యాజమాన్యాలకు మండుకొస్తుంది. కానీ.. ఇక్కడ ఉన్నది ఎలాన్ మస్క్. ఆయన తీరే వేరు. అందుకే.. డానియల్ ఫ్రాన్సిస్‌ను పనిలో పెట్టుకున్నారు. ఇటీవల ఓ రోజు వారిద్దరిని తన కార్యాలయానికి రప్పించి వారిద్దరినీ అభినందించారు. వాళ్ల ప్రాంక్ తనకు నచ్చిందని చెప్పిన ఆయన వారితో కలిసి ఫొటో కూడా దిగారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఫ్రాన్సిస్‌ను ఉద్యోగంలోకి తీసుకున్నారు. అయితే.. సంస్థలో అతడి హోదా ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

Updated Date - 2022-11-27T20:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising