ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంట్లో చెప్పకుండా పారిపోయిన ప్రేమజంట పరిస్థితి చివరకు ఏమయ్యిందంటే...

ABN, First Publish Date - 2022-12-27T12:40:07+05:30

పారిపోయన తరువాత వారికి పెద్ద ట్విస్ట్ తగిలింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'మా ఇంట్లో అస్తమాను ఏదో ఒక విషయానికి విసిగిస్తూనే ఉన్నారు నాకు చాలా చిరాకుగా ఉంది, నీతో మాట్లాడదామంటే ఫోన్ తీసుకోనివ్వరు, పదేపదే చదువుకోమని పోరు పెడుతుంటారు. ఇవి మాత్రమే కాకుండా నచ్చినపని ఏదీ చేయనీరు అన్నిటికీ రూల్స్, లిమిట్స్ పెడతారు మనం వెళ్ళిపోదాం' అని ఓ ప్రేమ జంట ఇంట్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించుకున్నారు. వారిద్దరి చర్చ కాస్తా ఇంట్లో నుండి పారిపోవడానికి సిద్దమయ్యేలా చేసింది. ఇద్దరూ చెరికొంచం డబ్బు తీసుకుని ఇంట్లో చెప్పకుండా పారిపోయారు. కానీ అలా పారిపోయన తరువాత వారికి పెద్ద ట్విస్ట్ తగిలింది. ఇంతకూ వీళ్ళెవరు వీరికి ఎదురైన పరిస్థితి ఏంటి? వంటి వివరాల్లోకి వెళితే..

భోపాల్ లో వేరు వేరు ప్రాంతాలలో నివసిస్తున్న ఇద్దరు మైనర్లకు పరిచయం ఎలా జరిగిందో కానీ వారిద్దరూ ప్రేమించుకున్నారు. వారిద్దరూ ఇంట్లో సమస్యలు ఎదురవుతున్న కారణంగా పారిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే తమ దగ్గరున్న కొంత డబ్బు తీసుకుని ఢిల్లీకి పారిపోయారు. ఆ డబ్బుతో దాదాపు నాలుగు రోజుల పాటు ఢిల్లీలో బాగా ఎంజాయ్ చేసారు. అయితే డబ్బు అయిపోగానే వారికి ఇబ్బందులు మొదలయ్యాయి. తినడానికి కూడా డబ్బు లేకుండా తయారయ్యింది పరిస్థితి. అప్పటిదాకా కుటుంబ సభ్యుల మీద మనసులో ఉన్న కోపం చిరాకు మాయమై ఇంటికి వెళితే మేలు అక్కడ సమస్య ఉండదు అనే ఆలోచన పుట్టింది. అనుకున్నట్టే ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకున్నారు. అయితే తిరిగి వెళ్ళడానికి ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి వారిదగ్గర డబ్బులేకపోవడంతో టికెట్ లేకుండానే ట్రైన్ ఎక్కేశారు.

ట్రైన్ గ్వాలియర్ దగ్గరగా వచ్చింది. అక్కడికి టికెట్స్ చెక్ చేస్తూ టికెట్ కలెక్టర్ వచ్చాడు. అతను అందరినీ అడిగినట్టే వారిని కూడా టికెట్ అడిగాడు. అయితే వారి దగ్గర టికెట్ లేకపోవడంతో టికెట్ కలెక్టర్ వారి గురించి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వారిద్దరినీ చూసి భోపాల్ లో రెండు వేరు వేరు పోలిస్ స్టేషన్లలో నమోదైన కేసులతో పోల్చి చూడగా.. నాలుగురోజుల క్రితం తప్పిపోయినట్టు అక్కడి పోలిసే స్టేషన్ లలో కేసులు నమోదైనట్టు తెలిసింది. వారిద్దరూ మైనర్ లే కావడంతో వారిని ఆర్పీయఫ్ పోలీసులకు అప్పగించారు. వారు భోపాల్ పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసులు ఆ పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. భోపాల్ నుండి పోలీసులు తల్లిదండ్రులు గ్వాలియర్ పోలిస్ స్టేషన్ కు చేరుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలను తమతో తీసుకెళ్ళిపోయారు. ఈ సంఘటన కాస్తా బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. డబ్బు లేకపోతే ఏ వయసు వారికైనా ఇదే గతి అంటున్నారు వీరి విషయం తెలిసిన నెటిజన్లు.

Updated Date - 2022-12-27T12:40:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising