ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shraddha Walkar: శ్రద్ధా ఇన్‌స్టాగ్రాంలో హ్యాపీడేస్ అంటూ ఫొటో పోస్ట్

ABN, First Publish Date - 2022-11-16T10:33:00+05:30

ప్రియుడితో కలిసి సహజీవనం చేసి, అతని చేతిలోనే దారుణ హత్యకు గురైన శ్రద్ధావాకర్ తన చివరి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోకు ‘‘హ్యాపీ డేస్’’....

Aaftab,Shraddha Happy Days
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రియుడితో కలిసి సహజీవనం చేసి, అతని చేతిలోనే దారుణ హత్యకు గురైన శ్రద్ధావాకర్ తన చివరి ఇన్‌స్టాగ్రామ్ ఫోటోకు ‘‘హ్యాపీ డేస్’’ అని క్యాప్షన్ పెట్టారు.(Happy Days) వాలెంటీన్స్ డే(Valentine's Day) సందర్భంగా ఈ ఏడాది ఫిబ్రవరి 14వతేదీన శ్రద్ధా(Shraddha) తన లివింగ్ భాగస్వామి అయిన(Live in Partner) ఆఫ్తాబ్‌తో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం నెటిజన్లను కంటతడి పెట్టించింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఆఫ్తాబ్‌తో పంచుకున్న ఏకైక ఫోటో ఇది.(Last Instagram Photo)హత్యకు గురైన శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తనను తాను వాండరర్‌గా అభివర్ణించింది.(Instagram Post)

ఆఫ్తాబ్(Aftab Ameen Poonawala) 28వేల మంది ఫాలోవర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ బ్లాగ్‌ను నడుపుతున్నాడు. శ్రద్ధా వాకర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేదు.2,700 మందికి పైగా ఫాలోవర్లు ఉన్న శ్రద్ధావాకర్ సుందరమైన ప్రదేశాల చిత్రాలు పోస్టు చేశారు. హత్యకు ఒక వారం ముందు శ్రద్ధా హిమాచల్ ప్రదేశ్‌లో ఒక పుస్తకం చదువుతున్న తన చిత్రాన్ని పోస్ట్ చేసింది. ఈ చిత్రం ‘‘ప్రతిరోజు మరింతగా అన్వేషించడం కోసం’’ అనే శీర్షికతో మే 11వతేదీన పోస్ట్ చేశారు.

హత్యకు 10 రోజుల ముందు శ్రద్ధా ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో గంగానది వద్ద ఫోజుఇచ్చి నిర్మలమైన ప్రదేశం నుంచి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను కూడా పోస్ట్ చేసింది. శ్రద్ధాకు ప్రయాణం అంటే చాలా ఇష్టమని, కొత్త ప్రదేశాలను అన్వేషించడాన్ని ఇష్టపడుతుందని క్యాప్షన్ సూచిస్తుంది.‘‘1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అలసిపోయిన తర్వాత నేను సూర్యాస్తమయంతో ముగించాలని నిర్ణయించుకున్నాను. వశిష్ట గుఫాలో గంగా తీరంలో నడిచాను. పరమ నిర్మలమైన గంగానది ఒడ్డున కూర్చున్న నాకు ఇది పిలుపు అని ఎవరికి తెలుసు’’ అంటూ శ్రద్ధా పోస్ట్ చేశారు.

Updated Date - 2022-11-16T11:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising