ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NTR Centenary birth celebrations - Balakrishna: ఖాళీగా ఉండడం ఓ వ్యాధి!

ABN, First Publish Date - 2022-10-31T20:00:54+05:30

‘‘అవకాశాలు లేకపోతే సినిమా వాళ్లు ఒత్తిడికి లోనవడం సహజంగా జరుగుతుంది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి. కానీ భావితరాలకు విజయలక్ష్మి ఆదర్శం’’ అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


‘‘అవకాశాలు లేకపోతే సినిమా వాళ్లు ఒత్తిడికి లోనవడం సహజంగా జరుగుతుంది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి. కానీ భావితరాలకు విజయలక్ష్మి ఆదర్శం’’ అని నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)అన్నారు. సోమవారం ఎఫ్‌ఎన్‌సీసీలో జరిగిన ఎన్టీఆర్‌ శత జయంతి (NTR Centenary birth celebrations) వేడుకల్లో భాగంగా ప్రముఖ నటి ఎల్‌.విజయలక్ష్మిని (felicitations to Vijayalakshmi)సన్మానించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ (Balakrishna)మాట్లాడుతూ ‘‘నాన్నగారి శత జయంతి పురస్కారం ఎల్‌.విజయలక్ష్మికి అందించడం సంతోషం. శక పురుషుడి శత జయంతి వేడుకలు చేయడం సంతృప్తిగా ఉంది. విజయలక్ష్మిగారు నాన్నగారితో 15కు పైగా సినిమాలు చేశారు. తనదైన శైలి నటన, డాన్స్‌లతో ఎంతోమందిని అలరించారు. యాక్టింగ్‌ తర్వాత సీఏ చేసి, వర్జీనియా వర్సిటీలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. అవకాశాలు లేకపోతే సినిమా వాళ్లు ఒత్తిడికి లోనవడం సహజంగా జరుగుతుంది. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఒక రకమైన వ్యాధి. విజయలక్ష్మిగారు మంచి ఉద్యోగంలో స్థిరపడి భావితరాలకు ఆదర్శంగా నిలిచారు’’ అని అన్నారు. 

ఎల్‌.విజయలక్ష్మి మాట్లాడుతూ ‘‘ఎంతో అభిమానంతో నన్ను పిలిచి సన్మానం చేయడం సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ను ఆరాధిస్తూ పెరిగాను. నా జీవితంలో మరింత ముందుకు వెళ్లానంటే అందుకు ఎన్టీఆర్‌ నుంచి నేర్చుకున్న విలువలే కారణం. నిబద్థతకు ఆయన నిలువెత్తు నిదర్శనం. ఎన్టీఆర్‌తో కలిసి నటించే సమయంలో చాలా భయపడేదానిని. ఆయన మాత్రం చాలా సౌకర్యంగా చూసుకునేవారు’’ అని అన్నారు. సి.కల్యాణ్‌; ప్రసన్నకుమార్‌, దాము, తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Updated Date - 2022-10-31T20:00:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising