ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

National Energy Conservation Day: ఇంధన పొదుపు పర్వావరణ పరిరక్షణకు అవసరం.

ABN, First Publish Date - 2022-12-14T14:53:31+05:30

ఇంధనాలు వృథా వల్ల డబ్బు ఖర్చకాకవడమే కాకుండా, ఇంధనానికే షార్టేజ్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

Energy
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతి సంవత్సరం, భారతదేశం డిసెంబర్ 14న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్‌ను పాటిస్తుంది. నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అనేది ఇంధన పొదుపు ప్రాముఖ్యత గురించి భారతదేశంలోని ప్రజలలో అవగాహన కల్పించడం. శక్తి వృధాను తగ్గించడం, వనరులను కాపాడుకోవడంలో ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలని చెపుతుంది. ముఖ్యంగా, శక్తి వినియోగాన్ని తగ్గించడం, దానిని సమర్థవంతంగా ఉపయోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించడం ఈ రోజున ప్రధాన లక్ష్యం. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఆర్థికపరమైన పెరుగుదల పునర్నిర్మాణ రంగం ముఖ్యంగా ఇంధన రంగంపైనే ఆధారపడి ఉంది. ఈ రంగానికి ప్రత్యేకత కల్పిస్తూ మొత్తం ప్రణాళికలో 30 శాతం ఈ రంగానికే కేటాయించబడింది. ఆర్థిక రంగంలో సరళీకృత విధానాల ద్వారా ఇంధనం డిమాండ్ అధికమైంది. ఈ డిమాండ్, సప్లైల మధ్య సమన్వయం కోసం తీసుకున్న వివిధ రకాల వ్యూహాలతో ఇంధనాన్ని పరిరక్షించడమే తక్షణ కర్తవ్యంగా మారింది.

ఇంధనాలు అమూల్యమైనవి. వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఇంధనాలు వృథా చేసినందువల్ల డబ్బు ఖర్చకాకవడమే కాకుండా, ఇంధనానికే షార్టేజ్‌ (Shortage) వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఈ రెండింటిని మించి వాతావరణ కాలుష్యం పెరగడం, ఇంధనాలను ఖర్చుపెట్టడంవల్ల మొక్కలు, జంతువులు, ఇతర సహజ వనరులన్నీ దెబ్బతింటాయి. చెట్లు, జంతువులే లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. నదీనదాలు ఎండిపోవడం, ఓజోన్‌ పొరకు మరింత చిల్లులు పడటం లాంటి అనర్థాలతో పాటు వాతావరణ కాలుష్యం అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, మితిమీరిన ఎండలు లాంటి ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ కారణమౌతుంది. కనుక, ఎలా చూసినా ఇంధనాన్ని పొదుపు చేయడం మన కనీస కర్తవ్యం.

నేషనల్ ఎనర్జీ కన్సర్వేషన్ డేని ఎలా జరుపుకోవాలి

భారతదేశానికి పెద్ద పాత్ర ఉంది.

భారతదేశం 1.3 బిలియన్లకు పైగా జనాభా కలిగిన భారీ దేశం. జనాభాలో ఇంత పెద్ద భాగానికి వసతి కల్పించడం అంటే వాతావరణ మార్పులకు పెద్ద మొత్తంలో బాధ్యత వహించాల్సింది ప్రజలే.

పిల్లలకి అవగాహన కల్పించండి.

పిల్లలే మన భవిష్యత్తు, వారి భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి శక్తి పొదుపుపై పిల్లల్లో అవగాహన రావాలి. నీటిని పదే పదే వృధాగా పోనీయకూడదని, విద్యుత్ ని, ఇందనాన్ని వినియోగించడంలో పొదుపు చేయడంపై అవగాహన చిన్నతనం నుంచే రావాలి.శక్తి పరిరక్షణలో పిల్లలైనా, వృద్ధులైనా ప్రతి వయసుల వారికీ శక్తిని ఆదా చేయడం మీద అవగాహన అవసరం.

Updated Date - 2022-12-14T15:35:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising