ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒకే రోజు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.. తెల్లారినా ఆ ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూస్తే..

ABN, First Publish Date - 2022-06-22T00:40:51+05:30

వారిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ వివాహాలు చేసుకుని, పిల్లలతో కలిసి పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ ఆనందంగా గడిపేవారు. ఈ క్రమంలో ఒక రోజు ఎవరూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారిద్దరూ అన్నదమ్ములు. ఇద్దరూ వివాహాలు చేసుకుని, పిల్లలతో కలిసి పక్కపక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. ఎప్పుడూ అన్యోన్యంగా ఉంటూ ఆనందంగా గడిపేవారు. ఈ క్రమంలో ఒక రోజు ఎవరూ ఊహించని విధంగా రెండు కుటుంబాలకు చెందిన 9మంది మృతి చెందారు. తెల్లారినా కూడా రెండు ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. చివరకు వెళ్లి షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని మహైసల్‌కు చెందిన పోపట్ యల్లప్ప వాన్మోర్ (వయస్సు 52), మాణిక్ యల్లప్ప వాన్మోర్ (49) అన్నదమ్ములు. వీరు తమ పిల్లలతో కలిసి పక్క పక్క ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు. అన్న పోపాట్.. ఉపాధ్యాయుడిగా, తమ్ముడు మాణిక్.. వెటర్నరీ డాక్టర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రెండు కుటుంబాల వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇదిలావుండగా, రోజూ తెల్లవారుజామునే నిద్ర లేచే కుటుంబ సభ్యులు.. సోమవారం మాత్రం ఎంత సేపటికీ తలుపులు తీయలేదు. దీంతో స్థానికులకు అనుమానం వచ్చి.. వారికి ఫోన్ చేశారు. అయినా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో రెండు ఇళ్ల తలుపులు తీసి చూడగా.. మొత్తం 9మంది మృతదేహాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాకైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

నేను చనిపోయాకే నా విలువ మీకు తెలుస్తుందంటూ తల్లిదండ్రులకు మెసేజ్.. చనిపోయిన 21 ఏళ్ల యువకుడి మొబైల్‌లో..


సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు.. అన్నదమ్ములు ఇద్దరూ స్థాయికి మించి అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. మృతులు.. అక్కాటై వాన్మోర్ (72), పోపట్ యల్లప్ప వాన్మోర్ (52), మాణిక్ యల్లప్ప వాన్మోర్ (49), సంగీతా పోపట్ వాన్మోర్ (48), రేఖా మానిక్ వాన్మోర్ (45), అర్చన పోపట్ వాన్మోర్ (30), శుభమ్ పోపట్ వాన్మోర్ (28), అనితా మానిక్ వాన్మోర్ (28), ఆదిత్య మాణిక్ వాన్మోర్ (15)గా గుర్తించారు. రెండు కుటుంబాల్లోని కుటుంబ సభ్యులందరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.

అమ్మా.. నాన్నా.. నన్ను క్షమించండి.. నా చావుకు కారణమిదేనంటూ లేఖ రాసి మరీ 28 ఏళ్ల యువతి బలవన్మరణం

Updated Date - 2022-06-22T00:40:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising