వామ్మో.. 66ఏళ్ల వృద్ధుడిపై ఇన్ని అత్యాచార కేసులా..!
ABN, First Publish Date - 2022-11-26T13:56:48+05:30
వీటిలో కూడా 12 రేప్ కేసులు నేరుగా అతనే నిందితుడు అని నిరూపణ చేస్తున్నాయి.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 31 రేప్ కేసులు , అది కూడా 66 సంవత్సరాల వ్యక్తి మీద. ఇంటిల్లిపాదికీ ప్రేమను పంచే పెద్దవారు ప్రతి ఇంటికి మూలస్థంబాల లాంటి వాళ్ళు. కానీ వారే తప్పు చేస్తే.. తాజాగా ఓ 66 సంవత్సరాల వ్యక్తి మీద 31 రేప్ కేసులు చోటుచేసుకున్నాయి. వీటిలో కూడా 12 రేప్ కేసులు నేరుగా అతనే నిందితుడు అని నిరూపణ చేస్తున్నాయి. అందరికీ ఒక్కసారిగా షాక్ ఇచ్చిన సంఘటన గురించి వివరాల్లోకి వెళితే....
కీత్ సిమ్స్ అనే 66సంవత్సరాల వ్యక్తి 31 మందిని రేప్ చేశాడట. బాధితులు అందరూ 15నుండి 55 సంవత్సరాల మధ్య వయసు గల వారే కావడం గమనార్హం. 1986 నుండి 2001 సంవత్సరాల మధ్య ఇతను చాలా కృూరంగా అత్యాచారాలు చేశాడని తెలుస్తోంది. కీత్ సిమ్స్ వాకింగ్ కు వెళ్ళినపుడు దారిలో అడ్డగించి కత్తితో బెదిరించి కొందరిని, ఆడవారు ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసి కొందరిని బలత్కారం చేశాడట. అయితే ఇతను ఈ పనులు చేసేటప్పుడు ముఖానికి మాస్క్, స్పోర్ట్స్ దుస్తులు ధరించి ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్తపడేవాడు అంట. బాధితుల విచారణలో ఇతని పొడవు, శరీర రంగు మొదలయిన వాటిని గుర్తులుగా చెప్పారట. అయితే అతను ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరణించాడు. బాధితులు చెప్పిన గుర్తుల ప్రకారం ఇతడిని అనుమానించిన పోలీసులు ఇతన్ని సమాధి నుండి వెలికి తీసి డి.యన్.ఎ పరీక్షలు నిర్వహించి బాధితులకు తో సరిపోల్చి చూశారు. వాటి ప్రకారం ఇతడే నిందితుడని తేలింది. ఈ విషయం తెలియగానే మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు కలిగిన ఇతని కుటుంబ సభ్యులు అందరూ షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా నేను ఇన్నాళ్లు ఇలాంటి వ్యక్తితో జీవితం గడిపానా అని నమ్మలేక పోతోందట.
Updated Date - 2022-11-26T14:22:51+05:30 IST