ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండవ పానిపట్ యుద్ధంలో భారీ సైన్యం ఉన్నా హేము ఎందుకు అక్బర్ చేతిలో ఓడిపోయాడంటే...

ABN, First Publish Date - 2022-11-05T10:51:02+05:30

రెండవ పానిపట్ యుద్ధం 1556, నవంబరు 5న ఉత్తర భారత చక్రవర్తి హేము-మొఘల్ చక్రవర్తి అక్బర్‌ల మధ్య జరిగింది. ఈ యుద్ధం భారత మధ్యయుగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండవ పానిపట్ యుద్ధం 1556, నవంబరు 5న ఉత్తర భారత చక్రవర్తి హేము-మొఘల్ చక్రవర్తి అక్బర్‌ల మధ్య జరిగింది. ఈ యుద్ధం భారత మధ్యయుగ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది. ఒకవైపు హేము ఢిల్లీని స్వాధీనం చేసుకుని చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. మరోవైపు అక్బర్ తాను కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవాల్సిన స్థితి ఏర్పడింది. అక్బర్ వయసులో చిన్నవాడు కావడంతో బైరామ్ ఖాన్ రక్షణలో ఉన్నాడు. రెండు సైన్యాల మధ్య జరిగిన యుద్ధం చారిత్రాత్మకంగా నిలిచింది. హేము సైన్యాన్ని సంఖ్యాపరంగా చూస్తే మొఘల్ సైన్యం కంటే భారీగా ఉంది.

అందులో ఏనుగుల సంఖ్య అధికం. ఇంతేకాకుండా వారి సైన్యంలో అనుభవజ్ఞులు ఉన్నారు. మొఘలుల బలగాలు సంఖ్యాపరంగా బలహీనంగా ఉన్నాయి. హేము యుద్ధాన్ని ప్రారంభించి, తమ ఏనుగులను మొఘలుల వైపు విడిచిపెట్టాడు. ఏనుగుల దాడి మొఘలుల సైనాన్ని విచ్ఛిన్నం చేసింది. అయితే ఇదే సమయంలో మొఘలులు.. అశ్విక దళాల దాడిని మొదలుపెట్టాయి. దీంతో ఏనుగులు చెదిరిపోయాయి. ఫలితంగా హేము వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఆఫ్ఘన్‌లలో కదలిక లేకపోవడం చూసి మొఘల్ అశ్విక దళం ఆఫ్ఘన్ సైన్యంపై దాడి చేసి చుట్టుముట్టింది. హేము స్వయంగా ఈ యుద్ధానికి నాయకత్వం వహించాడు.

మొఘలుల బలగాలను అణిచివేసేందుకు తన బలగాలను మోహరించాడు. అయితే, ఈ సమయంలో హేము కంటికి మొఘలుల నుంచి వచ్చిన బాణం తగిలింది. దాని కారణంగా అతను మూర్ఛపోయాడు. ఇది చూసిన ఆఫ్ఘన్ సైన్యం భయాందోళనలకు గురైంది సైన్యం వెనక్కి తగ్గింది. మొఘలుల సంపూర్ణ విజయంతో యుద్ధం ముగిసింది. హేము సైన్యం 5 వేలకు మించిన మరణాలను చవిచూసింది. మొఘలులకు తక్కువ నష్టం వాటిల్లింది. మొత్తం మొఘల్ సైన్యాన్ని అణిచివేసేందుకు ఆఫ్ఘన్‌లు ప్రయత్నించగా, అక్బర్ సైన్యం హేముని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ఈ విజయంతో అక్బర్ ఉత్తర భారతదేశంలో మొఘలుల జెండాను ఎగురవేశాడు.

Updated Date - 2022-11-05T10:51:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising